₹10 నాణేల అంగీకరించడంపై తెలంగాణలో రాష్ట్రవ్యాప్త ప్రజా చైతన్య ప్రచారాన్ని నిర్వహిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

ఐవీఆర్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (23:20 IST)
భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, తెలంగాణలోని 33 జిల్లాల్లో విస్తరించిన తన 430 శాఖలు, 542 బీసీల ద్వారా ₹10 నాణేల స్వీకరణపై రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పబ్లిక్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ (పిఎసి) నిర్వహించింది. ₹10 నాణేల చట్టపరమైన చెల్లుబాటుకు సంబంధించి ఉన్న అపోహలను తగ్గించడం, ₹10 నాణేలపై ఎక్కువ నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడే ఉద్దేశంతో పబ్లిక్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ రిజర్వు బ్యాంకు, హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం సహకారాన్ని అందించింది.
 
ఈ క్యాంపెయిన్‌లో బ్యాంక్ మొత్తం రూ.10.96 లక్షల విలువైన ₹10 నాణేలను పంపిణీ చేసింది/మార్పిడి చేసింది. ఈ కార్యక్రమాన్ని మొదటిగా తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకు నిర్వహించింది. గత ఏడాది రూ.16.90 లక్షల విలువైన ₹10 నాణేలు పంపిణీ చేయబడ్డాయి/మార్పిడి చేయబడ్డాయి. ప్రముఖ మార్కెట్ ప్రాంతాలు/ రైతు బజార్, స్థానిక మార్కెట్‌లలో పోస్టర్‌లు/బ్యానర్‌లు/కొలేటరల్‌లు/కరపత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా, ప్రజల అవగాహన కోసం ఈ క్యాంపెయిన్‌లో సమర్థవంతమైన బ్రాంచ్ డిజిటల్ లెడ్ స్క్రీన్‌లు మరియు ఏటీఎంలలోనూ నిర్వహించిన ప్రత్యక్ష ప్రదర్శనకు చక్కని స్పందన లభించింది.
 
ఈ అవగాహన క్యాంపెయిన్ ద్వారా రిటైలర్లు/వ్యాపారులు/రోడ్డు రవాణా/పీఎం స్వనిధి లబ్ధిదారులు/చిరు వ్యాపారులు/కిరాణా దుకాణాలు మొదలైన వివిధ రకాల వినియోగదారులు ప్రయోజనాన్ని పొందారు. ముఖ్యంగా చిన్న పట్టణాలు, నగరాల్లో ముఖ్యమైన అవసరానికి అనుగుణంగా వారు తమ లావాదేవీల కోసం చిన్న మార్పును చేసుకున్నారు. శాఖల ద్వారా క్లస్టర్ హెడ్స్ సమక్షంలో నాణేలను పంపిణీ చేశారు.
 
ఈ సందర్భంలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, రీజినల్ హెడ్ వెంకటేష్ చల్లావర్ మాట్లాడుతూ, “రాష్ట్రంలోని చాలా నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ₹10 నాణేల అంగీకారంపై ఈ పబ్లిక్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ (PAC) రోజువారీ లావాదేవీలలో నాణేల వినియోగాన్ని, పెద్ద మొత్తంలో నగదు చలామణిని బలోపేతం చేస్తుంది. ఈ చొరవకుకు తమ మార్గదర్శకత్వం, మద్దతు అందించిన భారతీయ రిజర్వు బ్యాంకుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments