రూ.2,000 నోట్లను చలామణీ నుంచి తప్పించనున్నారా?

Webdunia
గురువారం, 27 మే 2021 (22:15 IST)
2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.57,757 కోట్ల విలువైన రూ.2,000 నోట్లను చలామణీ నుంచి తప్పించినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికను బట్టి తెలుస్తోంది. 
 
2019-20 ఆర్థిక సంవత్సరంలో చలామణీలో ఉన్న రూ.2,000 నోట్ల విలువ రూ.5,47,952 కోట్లు కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ రూ.4,90,195 కోట్లు అని వెల్లడైంది. అంటే ఒక ఏడాదిలో రూ.57,757 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణీ నుంచి తప్పుకున్నాయని అర్థమవుతోంది.
 
అయితే ఈ నోట్లు చలామణీ నుంచి తప్పుకోవడానికి అసలు కారణాలేమిటో తెలియడం లేదు. మరోవైపు గత ఆర్థిక సంవత్సరంలో నగదు డిమాండ్‌ను తట్టుకునేందుకు రూ.500 నోట్ల ముద్రణను ఆర్బీఐ పెంచింది. ప్రస్తుతం చలామణీలో ఉన్న నోట్లలో రూ.500 నోట్ల వాటా 68.4 శాతం. ఇది గత ఏడాది 60.8 శాతంగా ఉండేది.
 
రూ.2,000 నోట్లను అక్రమంగా దాచుకోవడం సులువుగా మారిందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు లభ్యతను మెరుగుపరచడంలో ఈ నోట్లు ఉపయోగపడినట్లు కొందరు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments