Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజిటల్ చెల్లింపులపై 20 శాతం క్యాష్ బ్యాక్.... ఆ కార్డుపైనే...

దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా, డిజిటల్ చెల్లింపులకు 20 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ఇవ్వాలని జీఎస్టీ మండలి సమావేశం నిర్ణయించింది. డిజిటల్‌ చెల్

Webdunia
ఆదివారం, 5 ఆగస్టు 2018 (14:23 IST)
దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా, డిజిటల్ చెల్లింపులకు 20 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ఇవ్వాలని జీఎస్టీ మండలి సమావేశం నిర్ణయించింది. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రయోగాత్మకంగా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది.
 
ఢిల్లీలో జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పందిస్తూ, భీమ్‌ యాప్‌, యుపిఐ, రూపే కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే, ఆ లావాదేవీపై చెల్లించాల్సిన జిఎస్‌టిలో రూ.100కు మించకుండా 20 శాతం వరకు వినియోగదారులకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. 
 
'ఇందుకోసం ఒక ప్రయోగాత్మక ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించాం. ఈ విధానంలో రూపే కార్డు, భీమ్‌, యుపిఐ, ఆధార్‌ ద్వారా వినియోగదారులు చేసే చెల్లింపులపై వ్యాపార సంస్థలు చెల్లించే జిఎస్‌టిలో 20 శాతానికి రూ.100 పరిమితికి లోబడి వినియోగదారులకు క్యాష్‌బాక్‌ రూపంలో లభిస్తుంది. ఈ చెల్లింపుల్లో ఎక్కువ భాగం పేదలే చేస్తారు. వారిని ప్రోత్సహించేందుకు ఈ ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించాం' అని చెప్పారు. 
 
ఈ నిర్ణయం వల్ల ఏటా రూ.1,000 కోట్ల జిఎస్‌టి ఆదాయానికి గండి పడుతుందని అంచనా వేసినట్టు చెప్పారు. అయినప్పటికీ పేదలకు ఉపయోగపడేలా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాగా ప్రయోగాత్మకంగా రాష్ట్రాలే ఈ విధానాన్ని అమలు చేస్తాయని గోయల్‌ తెలిపారు. 
 
డిజిటల్ చెల్లింపులకు 20 శాతం క్యాష్ బ్యాక్.... 
భీమ్ యాప్‌పై చెల్లింపులు.. 20 శాతం క్యాష్ బ్యాక్
జీఎస్టీ మండలి కీలక నిర్ణయం.. 20 శాతం క్యాష్ బ్యాక్ 
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments