Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.10కే ఎల్‌ఈడీ బల్బులు.. గ్రామ ఉజ్వల పథకం ప్రారంభం

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (10:53 IST)
LED bulb
'గ్రామ ఉజ్వల' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. కేంద్ర విద్యుత్తు, నూతన-పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ బీహార్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ తొలి దశలో భాగంగా ఐదు రాష్ట్రాల్లోని వివిధ గ్రామాల్లో విద్యుత్తును పొదుపు చేసే అత్యంత నాణ్యమైన 1.5 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను చౌకగా అమ్మనున్నారు. 
 
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ సమీప గ్రామాలతోపాటు వారణాసి (యూపీ), నాగ్‌పూర్‌ (మహారాష్ట్ర), అరహ్‌ (బిహార్‌), పశ్చిమ గుజరాతీ గ్రామాల్లో ఈ ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేయనున్నారు. మూడేళ్ల వారెంటీతో 7, 12 వాట్ల ఎల్‌ఈడీ బల్బులను అందివ్వనున్నారు. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా 5 బల్బులను విక్రయిస్తారు. వీటి వినియోగార్థం ఇండ్లలో మీటర్లనూ బిగించనున్నారు. 
 
గ్రామీణ ప్రజలకు ఈ ఎల్ఈడీ బల్బులు రూ.10లకే అందించనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) అనుబంధ కంపెనీ కన్వర్జెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీఈఎస్‌ఎల్‌) సంయుక్తంగా ఈ పథకం ద్వారా బల్బులను అందించనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments