Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి ధరకు కేంద్రం చికిత్స.. ఎగుమతులపై నిషేధం

Webdunia
ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (17:19 IST)
దేశ వ్యాప్తంగా ఉల్లి ధర ఆకాశాన్ని తాకివుంది. దీంతో ఉల్లిని కోయకముందే కన్నీరు వస్తోంది. దీనికి కారణం దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడమే. దేశంలోని అనేక ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.80కి పైగా పలుకుతోంది. పైగా నాణ్యత కూడా నాసిరకంగా ఉంటోంది. 
 
ఈ నేపథ్యంలో, కేంద్రం కాస్త కఠిన నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. తాము చెప్పేవరకు ఉల్లి ఎగుమతులు నిలిపివేయాలని కేంద్రం పేర్కొంది. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. 
 
అంతేకాకుండా, పౌరులు కావాలనే ఉల్లి నిల్వలను దాచిపెట్టి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని కేంద్రం భావిస్తోంది. ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు తామే ఉల్లిని తక్కువ ధరలకు ప్రజలకు అందిస్తున్నాయి. ఢిల్లీలో కిలో రూ.25, పంజాబ్‌లో కిలో రూ.35 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కొక్కరికి 2 కిలోలు మాత్రమే అమ్ముతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments