Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్.బి.ఐ చిన్న ఖాతాదారులకు శుభవార్త...

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకింగ్ వ్యవస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు తమ ఖాతాదారులకు ఓ శుభవార్త చెప్పింది. సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలో నెలవారీ సగటు నిల్వ లేనప్పుడు విధించే చార్జీలపై ఎస్‌బిఐ స్పష్ట

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (10:31 IST)
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకింగ్ వ్యవస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు తమ ఖాతాదారులకు ఓ శుభవార్త చెప్పింది. సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలో నెలవారీ సగటు నిల్వ లేనప్పుడు విధించే చార్జీలపై ఎస్‌బిఐ స్పష్టమైన వివరణ ఇచ్చింది. 
 
మినిమమ్ బ్యాలెన్స్ లేనిసమయంలో విధించే చార్జీలు కొన్ని రకాల ఖాతాలకు మినహాయింపు ఉన్నట్టు తెలిపింది. ముఖ్యంగా ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (పిఎంజెడివై), చిన్న ఖాతాలు, బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు డిపాజిట్‌ ఖాతాలకు కనీస సగటు నిల్వ నిబంధన వర్తించదని, ఈ ఖాతాల నుంచి ఎలాంటి చార్జీలను వసూలు చేయబోమని పేర్కొంది. 
 
అందువల్ల తమ సేవింగ్స్‌ ఖాతాలో నెలవారీ సగటు నిల్వలను ఉంచలేని కస్టమర్లు తమ ఖాతాను బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు డిపాజిట్‌ ఖాతాకు మార్పిడి చేసుకోవచ్చని, ఇందుకు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. 
 
అయితే ఈ ఖాతా ద్వారా నిర్వహించే లావాదేవీలపై కొన్ని రకాల ఆంక్షలు ఉంటాయని తెలిపింది. ఈ ఖాతాదారులు నెల రోజుల్లో నాలుగుసార్లు మాత్రమే నగదును ఉచితంగా తమ ఖాతాలోంచి విత్ డ్రా చేసుకోవచ్చని, ఈ నిబంధన ఎటిఎం విత్‌డ్రాయల్స్‌కు కూడా వర్తిస్తుందని పేర్కొంది. 
 
ఈ పరిమితి దాటిన తర్వాత బ్రాంచ్‌ నుంచి ఒకసారి డబ్బు ఉపసంహరించుకుంటే 50 రూపాయలతోపాటు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఎస్.బి.ఐ ఏటీఎంలో అయితే రూ.10తో పాటు పన్ను, ఇతర బ్యాంకు ఏటిఎంలో అయితే 20 రూపాయలతోపాటు పన్ను చెల్లించాల్సి ఉంటుందని స్పష్టత ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్ త్వరగా కోలుకోవాలి : హీరోయిన్ వరలక్ష్మి!!

బాలక్రిష్ణ డాకు మహారాజ్ సంక్రాంతి సందడి చేస్తుందా? డాకు మహారాజ్ రివ్యూ

మా నాన్న వల్లే నేనెంతో ధైర్యంగా ఆరోగ్యంగా ఉన్నాను : హీరో విశాల్

దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments