Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే గుండు కొడతాయన్నాం.. నిజంగానే కొట్టాయి.. కోట్లాది చిన్న ఖాతాదారుల గుండె గుబేల్

భారతదేశ బడా బ్యాంకుల్లో, జాతీయ బ్యాంకుల్లో ఖాతాదారులు ఇకపై ఫిక్సెడ్ డిపాజిట్లు వేస్తే గుండు కొట్టండం ఖాయ్ అని మన వెబ్‌సైట్‌లో వార్త ప్రచురించి రెండు రోజులు కాలేదు. నిజంగానే ఖాతాదారుల గుండు కొట్టే పనికి ది గ్రేట్ స్టేడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల గు

బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే గుండు కొడతాయన్నాం.. నిజంగానే కొట్టాయి.. కోట్లాది చిన్న ఖాతాదారుల గుండె గుబేల్
హైదరాబాద్ , మంగళవారం, 1 ఆగస్టు 2017 (01:31 IST)
భారతదేశ బడా బ్యాంకుల్లో, జాతీయ బ్యాంకుల్లో ఖాతాదారులు ఇకపై ఫిక్సెడ్ డిపాజిట్లు వేస్తే గుండు కొట్టండం ఖాయ్ అని మన వెబ్‌సైట్‌లో వార్త ప్రచురించి రెండు రోజులు కాలేదు. నిజంగానే ఖాతాదారుల గుండు కొట్టే పనికి ది గ్రేట్ స్టేడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల గుండు కొట్టే పనికి అప్పుడే శ్రీకారం చుట్టేసింది. ఫిక్సెడ్ డిపాజిట్లు కాదు ఖాతాదారులు అత్యవసరాలకు పనికొస్తుందని  భావించి సేవింగ్స్ ఖాతాల్లో ఉంచుకునే డిపాజిట్లపై వేటు వేసింది. ఇంతవరకు ఎస్‌బీ డిపాజిట్లపై ఎస్బీఐ కనీసం డిపాజిట్ రేటు కింద 4 శాతం వడ్డీని ఇస్తుండగా, ఇప్పుడు ఒకేసారి 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేటును తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. అంటే ఇకపై ఎస్బీఐలో చేసే సేవింగ్స్ డిపాజిట్లపై కేవలం 3.5 శాతం వడ్డీ రేటు మాత్రమే బ్యాంకు ఇస్తుందన్నమాట.
 
కీలకమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమీక్షా సమావేశం ముందు రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వరంగ స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సేవింగ్స్‌ ఖాతాల(ఎస్‌బీ) డిపాజిట్లపై వడ్డీ రేటును 50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తూ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. జూలై 31 నుంచి అమల్లోకి వచ్చేలా ఎస్‌బీఐ సేవింగ్స్‌ ఖాతాల డిపాజిట్లపై రెండు రకాల వడ్డీ రేట్లను ప్రకటించింది. ఇంతకుముందు వరకు ఫ్లాట్‌గా 4 శాతం వడ్డీ రేటు అమల్లో ఉండగా, ఇకపై రూ.కోటి పైబడి నగదు నిల్వలపైనే ఈ వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తోంది.
 
రూ.కోటిలోపు ఉన్న నగదు నిల్వలపై వడ్డీ రేటును అరశాతం తగ్గించి 3.5 శాతంగా నిర్ణయించింది. ద్రవ్యోల్బణం రేటు తగ్గడం, అధిక వాస్తవిక వడ్డీ రేటును పరిగణనలోకి తీసుకుని సేవింగ్స్‌ ఖాతాల డిపాజిట్లపై వడ్డీ రేటును సవరించినట్టు ఎస్‌బీఐ తెలిపింది. దీనివల్ల మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేటు (వ్యయాల ఆధారంగా రుణ వితరణ రేటు, ఎంసీఎల్‌ఆర్‌)ను ప్రస్తుత రేటు వద్దే కొనసాగించేందుకు సాధ్యపడుతుందని వివరించింది. కాగా, సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ రేటును అర శాతం తగ్గించడం వల్ల ఎస్‌బీఐ లాభం ఏకంగా 20 శాతం మెరుగుపడుతుందని పలు బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
 
రుణాలకు డిమాండ్‌ తగ్గడం, అధిక వాస్తవిక వడ్డీ రేటును పరిగణనలోకి తీసుకుని సేవింగ్స్‌ ఖాతాల డిపాజిట్లపై వడ్డీ రేటును సవరించినట్టు ఎస్‌బీఐ తెలిపింది. రూ.కోటిలోపు ఉన్న సేవింగ్స్‌ ఖాతా డిపాజిట్లు రూ.9.4 లక్షల కోట్లుగా ఎస్‌బీఐ ఎండీ (ఇన్‌చార్జ్‌) రజనీష్‌కుమార్‌ వెల్లడించడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంసీఎల్‌ఆర్‌ పెంపు లేదా సేవింగ్స్‌ డిపాజిట్‌ రేట్ల తగ్గింపు.. ఈ రెండు ప్రత్యామ్నాయాలే తమ ముందున్నాయన్నారు. ఎంసీఎల్‌ఆర్‌ను పెంచితే రుణాలు భారం అవుతాయన్నారు. 
 
అయితే, ఎస్‌బీఐ నిర్ణయం కోట్లాది మంది చిన్న ఖాతాదారుల పొదుపై ప్రభావం చూపనుంది. ఎస్‌బీఐకి 42 కోట్ల మంది వరకు ఖాతాదారులున్నారు. ఇటీవలి కాలంలో ఖాతాదారుల నుంచి అధిక ఆదాయాలను రాబట్టుకునే పలు నిర్ణయాలకు ఎస్‌బీఐ తెరతీస్తోంది. పొదుపు ఖాతాల్లో కనీస నగదు నిల్వలను పెంచుతూ లోగడ సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. విఫలమైతే జరిమానాల బాదుడునూ అమల్లో పెట్టింది. ఇదంతా లాభాలు పెంచుకునే వ్యూహమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎస్‌బీఐ నిర్ణయం మిగిలిన బ్యాంకులను ఈ దిశగా నడిచేందుకు పురికొల్పే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సేవింగ్స్‌ ఖాతా నిల్వలపై 6% వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్న యస్‌ బ్యాంకు, కోటక్‌ మహీంద్రా బ్యాంకులు ఈ విధమైన రేట్ల కోత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
 
జాతీయ బ్యాంకులు ఇంతగా వినియోగదారుల ఖాతాల్లో డిపాజిట్లపై గుండు కొడుతున్నా ఇంకా వాటి ఖాతాల్లో డబ్బులు దాయడం కంటే మతిహీమైనపని మరొకటి ఉండదు. వీలైనంత త్వరగా బడా బ్యాంకుల దోపిడీ నుంచి బయటపడి చిన్న తరహా బ్యాంకులకు మళ్లితే ఖాతాదారులను అవమానపర్చని, గౌరప్రదమైన  వడ్డీరోట్లను పొందవచ్చు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతి వేదికగా పవన్ మద్యంపై సమరం...