Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగ నేను కాదు.. మీ బ్యాంకులే.. వారంతా మెదడు లేనివారు : విజయ్ మాల్యా

Webdunia
ఆదివారం, 14 జులై 2019 (12:53 IST)
తనను దొంగ దొంగ అంటూ కామెంట్స్ చేస్తున్న వారికి యూపీ గ్రూపు మాజీ అధినేత విజయ్ మాల్యా గట్టిగా కౌంటరిచ్చారు. తనను దొంగ దొంగ అంటున్నవారంతా మెదడులేనివారని వ్యాఖ్యానించారు. 
 
బ్యాంకులకు తన సంస్థలు చెల్లించాల్సిన బకాయిలను అన్నింటినీ కడతానని ఏడాది కాలంగా చెబుతున్నా బ్యాంకులేవీ పట్టించుకోవడం లేదని, ఇక దొంగెవరో తేల్చుకోవాలని ఆయన కోరారు. పైగా, తాను దొంగను కాదనీ, బ్యాంకులే దొంగలన్నారు. 
 
భారత్‌లోని పలు బ్యాంకుల నుంచి వేలాది కోట్లాది రూపాయల మేరకు రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన లండన్‌లో తలదాచుకుంటున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్‌తో కలసి దిగిన ఫొటోను ఆయన పోస్ట్ చేయగా, పలువురు నెటిజన్లు 'దొంగ... దొంగ' అని కామెంట్లు పెట్టారు. దీనిపై విజయ్ మాల్యా స్పందించాడు. తన స్నేహితుడు, యూనివర్సల్ బాస్‌ క్రిస్ గేల్‌‌ను కలడవం ఆనందాన్ని కలిగించిందన్నారు. 
 
తనను కొందరు అదే పనిగా ట్రోల్ చేస్తున్నారని, తనను దొంగ అంటున్నవారంతా మెదడులేనివారేనని మండిపడ్డారు. ఇచ్చిన డబ్బులు వసూలు చేయమని మీ బ్యాంకులను నిలదీయాలని, తాను తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిస్తానని సంవత్సరం నుంచి చెబుతూనే ఉన్నానని అన్నారు. అందువల్ల దొంగ ఎవరో? తేల్చుకోవాలంటూ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments