Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విజృంభణ: ప్రయాణీకులపై ఆంక్షలు ఎత్తివేస్తూ ఉత్తర్వులు

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (14:38 IST)
భారత్‌లో కరోనా విజృంభణ సమయంలో భారత్ నుండి వెళ్లే ప్రయాణికులపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ తరుణంలో జర్మనీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు పలు దేశాల ప్రయాణికులపై విధించిన ఆంక్షలను జర్మనీ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. భారత్‌ను హై ఇన్సిడెన్స్ ఏరియా కేటగిరీ కిందకు చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. 
 
దీని ప్రకారం భారతీయులకు జర్మనీలో ప్రవేశించేందుకు అనుమతి లభించనుంది. ఇందుకు సంబంధించి జర్మనీ ప్రభుత్వ ఏజెన్సీ రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ భారత్, నేపాల్, రష్యా, పోర్చుగల్, బ్రటన్‌లను హై ఇన్సిడెన్స్ ఏరియాలుగా వర్గీకరించామని తెలుపుతూ సోమవారం వెల్లడించింది.  
 
కొత్త మార్పుల కారణంగా విదేశీ ప్రయాణికులు జర్మనీకి వచ్చేందుకు పెద్దగా ఆంక్షలు ఉండకపోవచ్చు. ఇటీవలి కాలంలో పలు దేశాలు భారత్ ప్రయాణీకులపై ఆంక్షలు ఎత్తివేస్తూ ఉండగా.. ఆ లిస్టు లోకి జర్మనీ కూడా చేరింది.
 
వారం క్రితం దుబాయ్ ప్రభుత్వం కూడా భారత ప్రయాణికులపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. భారత్‌లో కరోనా కట్టడి అవుతూ ఉండడం.. వ్యాక్సినేషన్ కూడా వేగంగా జరుగుతూ ఉండడంతో ఎటువంటి లక్షణాలు లేని వారిని, వ్యాక్సిన్ వేయించుకున్న భారతీయులను ఇతర దేశాలకు వెళ్లే అవకాశాలను కల్పిస్తూ ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments