Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు స్థాయిలో ఆర్థిక లోటు - ఏకంగా 135.1 శాతంగా నమోదు

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (12:38 IST)
కరోనా వైరస్ కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఆర్థిక లోటు ఏర్పడింది. గత ఆర్థిక సంవత్సరం (2019-2020)2020లో నమోదైన 114.8 శాతం లోటుతో పోలిస్తే 2020-2021 ఆర్థిక సంవత్సరంలో మరింతగా పెరిగిపోయింది. 
 
ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి ఆర్థిక లోటు 135.1 శాతంగా నమోదైందని బడ్జెట్ అంచనాల్లో కేంద్రం పేర్కొంది. దాని విలువ 10 లక్షల 75 వేల 507 కోట్ల రూపాయలుగా ఉంది.
 
కాగా, గురువారం కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన తాజా నివేదికలో కేంద్రం ఈ విషయాలను వెల్లడించింది. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో ఆర్థిక లోటును 7.96 లక్షల కోట్లు అంటే జీడీపీలో 3.5 శాతంగా  పేర్కొన్నారు. కానీ, అంచనాలకు మించి అది నమోదైంది.
 
కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయని, దాని వల్లే ఆర్థిక లోటు భారీగా పెరిగిందని వివరించింది. విధిలేని పరిస్థితుల్లో విధించిన లాక్ డౌన్ల వల్ల అన్ని వ్యాపారాలు ఆర్థికంగా చితికిపోయాయని, దీంతో ప్రభుత్వానికి ఆదాయమూ బాగా తగ్గిపోయిందని పేర్కొంది.
 
నవంబర్ చివరి నాటికి ప్రభుత్వానికి రూ.8 లక్షల 30 వేల 851 కోట్ల మేర ఆదాయం వచ్చిందని, బడ్జెట్ అంచనాల్లో అది 37 శాతం అని కేంద్రం పేర్కొంది. అందులో రూ.6 లక్షల 88 వేల 430 కోట్లు పన్నుల రూపంలోనే ఆదాయం వచ్చిందని చెప్పింది. పన్నేతర ఆదాయం రూ.లక్షా 24 వేల 280 కోట్లు, రుణేతర మూలధన ఆదాయం రూ.18,141 కోట్లు అని వెల్లడించింది. రుణ రికవరీలు, పెట్టుబడి విరమణల ఆదాయాన్ని రుణేతర ఆదాయంగా వివరించింది.
 
2019–2020లో వచ్చిన పన్నుల ఆదాయం 45.5తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో తగ్గిందని, కేవలం 42.1 శాతమే వచ్చిందని పేర్కొంది. పన్నేతర ఆదాయంలో భారీగా కోత పడినట్టు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో 74.3 శాతంగా ఉన్న పన్నేతర ఆదాయం.. ఇప్పుడు 32.3 శాతమే నమోదైందని చెప్పింది. వివిధ రాష్ట్రాలకు పన్నుల వాటాల రూపంలో నవంబర్ నాటికి రూ.3.34 లక్షల కోట్లు అందించామని కేంద్రం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

తర్వాతి కథనం
Show comments