వైజాగ్‌లో మొదటి బ్యాచ్ Speed 400 బైక్‌లను డెలివరీ చేసిన Triumph

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (16:17 IST)
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న Triumph Speed 400ను Triumph వైజాగ్ డీలర్‌షిప్‌ వద్ద 4 ఆగస్టున వైజాగ్‌లో డెలివరీ చేశారు. జూన్ 27న లండన్‌లో విడుదల చేసిన Triumph Speed 400, Scrambler 400 X వినియోగదారుల నుండి అపూర్వమైన స్పందనను పొందాయి. గత వారం పూణే, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో విజయవంతంగా విడుదల చేసిన తర్వాత, వైజాగ్‌లో మొదటి బ్యాచ్ వాహనాల డెలివరీ చేయటానికి నిర్వహించిన కార్యక్రమంలో Triumph Speed 400కి అద్భుతమైన స్పందన లభించింది.
 
ఆన్‌లైన్‌లో Speed 400ని బుక్ చేసుకున్న కస్టమర్‌లకు, ఉత్సాహం మరియు వేడుకలతో నిండిన వాతావరణంలో వారి బైక్‌లను మొదటిగా అందించారు. వారు ఈ బైక్‌ల టెస్ట్ రైడింగ్ చేశారు. Triumph మోటార్‌సైకిల్స్‌ను నిర్వచించే అత్యుత్తమ నైపుణ్యం మరియు అత్యాధునిక సాంకేతికతను హైలైట్ చేస్తూ కథలు మరియు అనుభవాలు పంచుకోవడంతో డీలర్‌షిప్‌లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. తళతళ మెరుస్తున్న బైక్‌లు, సహజమైన వరుసలలో అమర్చబడి, ఆకర్షణీయమైన శైలి మరియు శక్తి యొక్క భావాన్ని వెదజల్లాయి. డీలర్‌షిప్ సిబ్బంది కూడా మొదటి Triumph మోటర్ సైకిల్‌ను డెలివరీ తీసుకున్న కస్టమర్‌ల లాగానే సంతోషం ప్రదర్శించటంతో పాటుగా అభిమానులకు తగిన సహాయం చేశారు. సౌకర్యవంతమైన, సంతృప్తికరమైన డెలివరీ అనుభవాన్ని నిర్ధారించడానికి ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చారు.
 
ఈ సందర్భంగా Probiking ప్రెసిడెంట్ సుమీత్ నారంగ్ మాట్లాడుతూ, “భారతీయ మోటార్‌సైకిల్ పరిశ్రమకు ఒక ప్రతిష్టాత్మక దినంగా ఈ కార్యక్రమం నిలువనుంది. ఈ రోజు, మా గౌరవనీయమైన కస్టమర్‌లకు మా అసాధారణమైన మోటార్‌సైకిళ్లను అందించినందుకు సంతోషిస్తున్నాము. వైజాగ్‌లో అద్భుతమైన రైడింగ్ అనుభవాలను అందించడానికి, బలమైన బైకింగ్ సంస్కృతిని కలిగి ఉన్న వైజాగ్‌లో బలమైన కమ్యూనిటీని పెంపొందించడానికి ఇది మా మొదటి అడుగు. Speed 400 జోడింపుతో, మేము మా డీలర్ భాగస్వామితో కలిసి బ్రాండ్ Triumphను ఔత్సాహిక రైడర్‌లకు సరసమైన ఎంపికగా మార్చే ప్రయాణాన్ని ప్రారంభించాము" అని అన్నారు. 
 
కొత్త కస్టమర్లు 16,000 కి.మీల సర్వీస్ విరామాలతో రెండేళ్ల అపరిమిత మైలేజ్ వారంటీతో పాటు మరో మూడేళ్లపాటు పొడిగించిన వారంటీ సైతం పొందుతారు. Bajaj Auto Ltd తన కొత్త చకన్ ప్లాంట్‌లో తయారుచేసిన Speed 400  వైజాగ్ లోని Triumph డీలర్‌షిప్‌లో ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.33 లక్షలకు అందుబాటులో ఉంటుంది. Speed 400 కోసం బుకింగ్‌లు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

Raviteja: అందుకే మాస్ జాతర చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది : దర్శకుడు భాను భోగవరపు

Bunny Vas: ఖమ్మం, వరంగల్ మధ్య జరిగే రియల్ కథతో రాజు వెడ్స్ రాంబాయి : వేణు ఊడుగుల

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments