Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై తండ్రీ కుమారుడు అత్యాచారం... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (15:35 IST)
హైదరాబాద్ నగరంలో ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. తండ్రీ కుమారులో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కొంపల్లికి చెందిన శివకుమార్‌(45), అతని కుమారుడు శ్యామెల్‌ (19)లు గురువారం సాయంత్రం తమ ఇంటికి సమీపంలో ఉన్న ఓ బాలికకు సెల్‌ఫోన్‌ ఇస్తామని ఆశచూపించి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులైన తండ్రి, కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 
 
తండ్రి కాళ్లు విరగ్గొట్టిన కుమార్తె.. ఎక్కడ? 
 
తన ప్రేమకు అడ్డొస్తున్నాడని కన్నతండ్రినే మట్టుబెట్టాలని ఓ కుమార్తె చూసింది. ఇందులోభాగంగా, కొందరు కిరాయి మూకలకు సుపారీ ఇచ్చిన తండ్రి కాళ్లు విరగ్గొట్టింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మధ తాలూకాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మధ తాలూకాకు చెందిన మహేంద్ర షా అనే వ్యక్తి స్థానికంగా ధనవంతుడు. పైగా వ్యాపారవేత్త కూడా. ఆయన కుమార్తె సాక్షి. ఈమె చైతన్య అనే యువకుడిని ప్రేమిస్తుంది. అతడితో లేచిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి మందలించాడు. దీంతో తమకు అడ్డుగా ఉన్న తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న నిర్ణయించింది. ఇందులోభాగంగా, రూ.60 వేల సుపారీ ఇచ్చి నలుగురు రౌడీలను రంగంలోకి దించింది. వారితో తండ్రి కాళ్లు విరగ్గొట్టించేందుకు భారీ కుట్ర పన్నింది.
 
ఈ క్రమంలో తొలుత పూణెకు వెళ్లి ఆదివారం రాత్రి మధకు వచ్చింది. స్థానిక బస్టాండ్‌కు చేరుకున్నాక తండ్రికి ఫోన్ చేసి వచ్చి ఇంటికి తీసుకెళ్లమని కోరింది. కూతురి పన్నాగం తెలియకపోవడంతో తండ్రి కారులో వచ్చి కుమార్తెను తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అయితే, మార్గమధ్యంలో మూత్ర విసర్జన చేయాలంటూ తండ్రికి చెప్పి, కారును వాడచివాడి గ్రామంలో ఆపాలని ఆమె కోరింది. అప్పటికే వారి కారు కోసం కొందరు వెంబడిస్తున్నారు. ఈ విషయం తెలియని ఆయన కూతురు చెప్పినట్టు కారు ఆపారు. 
 
వారిని వెంబడిస్తున్న దుండగులు యువతి అలా పక్కకు వెళ్లగానే ఒక్కసారిగా మహేంద్ర షాపై దాడి చేసి కిరాతకంగా చావబాదారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కాళ్లు కూడా విరిగిపోయాయి. ఈ దాడిలో ఆయన తనకు తీవ్ర గాయమైంది. దెబ్బలు తాళలేక ఆయన ఆర్తనాదాలు చేయడంతో దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. ఆ తర్వాత గ్రామస్థులు ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కుమార్తె కుట్ర కోణం వెలుగు చూసింది. దీంతో ఆమెతో పాటు ఈ దాడిలో పాల్గొన్న నలుగురు దుండగులు, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. మహేంద్ర షా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments