Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎఫ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్- రెండింతలు కానున్న పెన్షన్

పీఎఫ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. పీఎఫ్ ఉద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. అదేంటంటే.. త్వరలో వీరి పెన్షన్ రెండింతలు కానుంది. ఎంప్లాయ్‌మెంట్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)ల

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (10:46 IST)
పీఎఫ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. పీఎఫ్ ఉద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. అదేంటంటే.. త్వరలో వీరి పెన్షన్ రెండింతలు కానుంది. ఎంప్లాయ్‌మెంట్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)లో సభ్యులుగా ఉన్నవారికి ప్రస్తుతం నెలకు కనీసంగా రూ.1,000 పింఛన్‌‌ను చెల్లిస్తున్నారు.


భవిష్యత్తులో ఇది రూ.2 వేల నుంచి గరిష్ఠంగా రూ.5 వేల వరకు పెరగనుంది. ఈపీఎస్-95 కింద 60 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరిలో 40 లక్షల మంది నెలకు రూ.1500 అంతకంటే తక్కువ చొప్పున పెన్షన్ పొందుతున్నట్టు అంచనా.
 
ఇందులో భాగంగా పింఛన్‌ను పెంచేందుకు ఇటీవల ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది కేంద్ర కార్మికశాఖ. ప్రస్తుతం ఈపీఎఫ్ కింద అందజేస్తున్న పింఛన్ అతితక్కువగా ఉందని, దీన్ని మరింతగా పెంచాలని కమిటీ అభిప్రాయపడింది. ఇందులో భాగంగా కనీస పెన్షన్‌‌గా రూ.2 వేలు ప్రకటించాలని, గరిష్ఠంగా రూ.5వేలకు పెంచితే బాగుంటుందని ప్రభుత్వానికి కమిటీ సూచించింది. 
 
దీంతో... పింఛన్ పెంపుపై ఈపీఎఫ్‌వో కార్యనిర్వాహక కమిటీ, కేంద్ర కమిటీ రెండురోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. పెన్షన్‌‌ను రూ.2వేలకు పెంచితే కేంద్రంపై రూ.3వేల కోట్ల భారం పడనుంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments