Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోమారు బాదేశారు.. గ్యాస్ సిలిండరుపై రూ.50 పెంపు

Webdunia
ఆదివారం, 8 మే 2022 (08:47 IST)
ఆరు వారాల్లో గ్యాస్ సిలిండరుపై మరోమారు భారం మోపారు. 14.2 కేజీల సిలిండర్ ధర రూ.50 పెంచేసింది. దీంతో హైదరాబాద్ నగరంలో ఒక సిలిండర్ ధర రూ.1052కు చేరికంది. అయితే, ఈ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేట్ ఇండియన్ లూటీ అంటూ కామెంట్స్ చేశారు. 
 
ఇప్పటికే పెట్రోలు, డీజిలు ధరల పెంపుతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై మరో భారం పడింది. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర మళ్లీ పెంచడం దారుణమని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు వారాల్లో రెండో సారి సామాన్యులపై గ్యాస్‌ ధరను చమురు కంపెనీలు రెండోసారి పెంచేశాయి.
 
తాజా పెంపుతో 14.2 కిలోల సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.999.50కి చేరింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ.1002 ఉండగా.. తాజా పెంపుతో రూ.1052కు చేరుకుంది. మార్చి 22న సిలిండర్‌పై రూ.50 పెంచిన చమురు సంస్థలు తాజాగా మరో 50 రూపాయలు పెంచడం గమనార్హం. 
 
ఇక ఈ నెల 1న వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై రూ.102 పెంచిన సంగతి తెలిసిందే. దీంతో 19 కిలోల సిలిండర్‌ ధర రూ.2355.50కు చేరింది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం వల్లే గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచాల్సి వచ్చినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. ఏప్రిల్‌ 2021 నుంచి ఇప్పటి వరకు సిలిండర్‌పై రూ.190 పెరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments