Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి: కేసీఆర్ సంతాపం

bojjala
, శుక్రవారం, 6 మే 2022 (17:47 IST)
bojjala
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. 
 
బొజ్జల మృతి మరణం అత్యంత బాధాకరమన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. సీనియర్ నాయకుడి అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని, అణునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించేవారని పేర్కొన్నారు. బొజ్జల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని, బొజ్జల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. 
 
బొజ్జల మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తనతో కలసి పనిచేసిన బొజ్జల ఆత్మీయుడని.. అలాంటి మిత్రున్ని కోల్పోయానని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. బొజ్జల కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 
 గోపాలకృష్ణారెడ్డి చిత్తూరు జిల్లా శ్రీకాళాహస్తి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ సీఎం చంద్రబాబు మంత్రివర్గంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అలిపిరి బాంబ్ బాస్ట్ లో చంద్రబాబుతో పాటుగా బొజ్జల గాయపడ్డారు.
 
1989, 1994, 1999, 2009, 2014లో 5 దఫాలుగా గెలుపొందిన బొజ్జల ఉమ్మడి రాష్ట్రంలో ఐ.టీ మినిస్టర్ గా ఏ.పీ తొలి మంత్రివర్గంలో అటవీశాఖ మంత్రిగా పని చేశారు. గోపాలకృష్ణారెడ్డి మృతిపై ఏపీ, తెలంగాణ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జస్టిస్ ఫర్ నాగరాజు.. నా భర్తను నడిరోడ్డుపై నరికేశారు.. అందరూ చూశారే కానీ..?