Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ హ్యాండ్ వాషింగ్ దినోత్సవం 2024: 30 మిలియన్ పిల్లలను చేరుతున్న డెట్టాల్ బనేగా స్వాస్త్ ఇండియా

ఐవీఆర్
శుక్రవారం, 18 అక్టోబరు 2024 (20:23 IST)
రెకిట్స్ ఫ్లాగ్ షిప్ కాంపైన్, డెట్టాల్ బనేగా స్వాస్త్ ఇండియా (బిఎస్ఐ) అంతర్జాతీయ హ్యాండ్ వాషింగ్ దినోత్సవం 2024ను సంబరంలో భాగంగా, ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం చేతులు కడుక్కోవడం యొక్క ప్రాధాన్యత పై భారతదేశంవ్యాప్తంగా 30 మిలియన్ పిల్లలకు అవగాహన కల్పిస్తోంది. ‘క్లీన్ హ్యాండ్స్ ఫర్ ఆల్: అడ్వాన్సింగ్ హెల్త్ ఈక్విటీ త్రూ హైజీన్’ ఇతివృత్తంగా, ఈ కార్యక్రమం అన్ని స్థాయిలకు చెందిన పిల్లలకు ప్రధానమైన పరిశుభ్రత గురించి అవగాహన ఉండాలని, ఎవరూ ఈ విషయంలో వెనకబడకూడదని నిర్థారించడంలో డెట్టాల్ బిఎస్ఐ యొక్క నిబద్ధతను తెలియచేస్తోంది.
 
అంతర్జాతీయ హ్యాండ్ వాషింగ్ దినోత్సవం 2024 సందర్భంగా, బిఎస్ఐ కింద డెట్టాల్ స్కూల్ హైజీన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం 100+ భాగస్వాముల మద్దతుతో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో 30 మిలియన్ పిల్లలను నిమగ్నం చేసింది. పబ్లిక్ ,ప్రైవేట్, ప్రభుత్వ సహాయంతో పని చేసే, అన్ ఎయిడెడ్ రంగాలలో, భారతదేశంవ్యాప్తంగా సర్వోదయ విద్యాలయాస్, నవోదయ విద్యాలయాస్, ఆర్మీ పాఠశాలలు మరియు కేంద్రీయ విద్యాలయాలు సహా పాఠశాలల్లో పాల్గొనడం ద్వారా సక్రమంగా చేతులు శుభ్రం చేసుకునే టెక్నిక్కులను ఈ కాంపైన్ ప్రోత్సహించింది.
 
చొరవ యొక్క నిరంతర ఆవిష్కరణలో భాగంగా, డెట్టాల్ బిఎస్ఐ హైజీయా అనగా గ్రీకుల ఆరోగ్యం, పరిశుభ్రత, శుభ్రతల దేవత ప్రేరణతో డెట్టాల్ హైజీన్ చాట్ బాట్, హైజీయా ఫర్ గుడ్ హైజీన్ ను విడుదల చేసింది. ఈ AI ఆధారిత, వాట్సాప్ ప్రారంభించబడిన చాట్ బాట్ 7 భాషల్లో- హిందీ, ఇంగ్లిష్, తమిళం, కన్నడం, ఒడియా, గుజరాతీ, తెలుగు భాషలలో పరిశుభ్రత గురించి కీలకమైన విజ్ఞాన అందిస్తుంది. 22 అధికారిక భారతీయ భాషల్లో కూడా విస్తరించే ప్రణాళికలను కలిగి ఉంది. గొప్ప ప్రమేయం, చైతన్యాన్ని ప్రోత్సహించే స్వీయ-శిక్షణ, స్వీయ-సహాయం సాధనాలు, ఇంటరాక్టివ్ ప్లాట్ ఫాంస్ కోసం పెరుగుతున్న అవసరాన్ని చాట్ బాట్ సూచిస్తోంది.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రవి భట్నాగర్, ఎక్స్ టర్నల్ అఫైర్స్ మరియు పార్ట్ నర్ షిప్స్ డైరెక్టర్, రెకిట్ దక్షిణాసియా, ఇలా అన్నారు, “పరిశుభ్రతా అవగాహన కోసం, ప్రతి చిన్నారి కోసం ఆరోగ్యకరమైన భవిష్యత్తును సృష్టించడానికి రెకిట్ లో మేము అడ్డంకులను తొలగించడానికి కట్టుబడ్డాము. పరిశుభ్రతా సమానత్వానికి మా దీర్ఘకాల నిబద్ధత అనేది భారత ప్రభుత్వం వారి క్లీన్ ఇండియా ఉద్యమంతో ఒక దశాబ్దానికి పైగా అనుసంధానమైంది, ప్రతి చిన్నారికి, వారు ఏ నేపధ్యానికి చెందిన వారైనా జీవితాన్ని కాపాడే చేతులు శుభ్రం చేసుకునే పద్ధతిని నేర్చుకోవడాన్ని నిర్థారించడంలో ఇది కేంద్రీకరించబడింది. మేము ఇటీవల ఈ చొరవ యొక్క 11వ సంవత్సరంలో అడుగు పెట్టడంతో, పరిశుభ్రతా సమానత్వంపై మా ప్రాధాన్యత ఇంతకు ముందు కంటే శక్తివంతంగా ఉంది, ‘ఒక్కరు కూడా వెనకబడకూడదు‘ అనే మా విస్తృతమైన మిషన్ కు మద్దతునిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

నిజాయితీగా పనిచేస్తే సినీ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. బోయపాటి శ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments