Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనీ టైమ్ బ్యాన్... రూ.2 వేల నోటు రద్దేనా?

దేశంలో పెద్ద నోట్ల రద్దుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు ప్రకటన చేయనున్నారా? అవుననే అంటున్నాయి... ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు వర్గాలు.

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (08:49 IST)
దేశంలో పెద్ద నోట్ల రద్దుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు ప్రకటన చేయనున్నారా? అవుననే అంటున్నాయి... ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు వర్గాలు. గత యేడాది రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెల్సిందే. వీటి స్థానంలో కొత్త రూ.2000 నోటు, రూ.500 నోట్లను ప్రవేశపెట్టారు. అయితే, ఇపుడు రూ.2 వేల నోటును కూడా రద్దు చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
ఇప్పటికే రిజర్వ్‌బ్యాంకు 2000 రూపాయల నోట్ల పంపిణీని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెపుతోంది. ఈ మధ్య లోక్‌సభలో ఆర్థికశాఖ ప్రవేశపెట్టిన నివేదికను, రిజర్వ్‌బ్యాంకు వార్షిక నివేదికను పక్కపక్కన పెట్టి అధ్యయనం చేసినపుడు ఈ విషయం స్పష్టమయ్యిందని తమ నివేదికలో పేర్కొంది. 
 
"పెద్ద నోట్ల రద్దు అనంతరం వెంటనే మార్కెట్లో ద్రవ్య లభ్యత కోసం రూ.2,000 నోట్లు తీసుకురాగా, లావాదేవీలపరంగా సవాళ్లకు దారితీసింది. దీంతో ఆర్‌బీఐ రూ.2,000 నోట్లను ప్రింట్‌ చేయడం ఆపి ఉంటుంది. లేదా తక్కువ సంఖ్యలో ముద్రించి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో చిన్న నోట్ల వాటా 35 శాతానికి చేరింది" అని నివేదిక స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments