Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజైన్‌ ఫర్‌ సర్క్యులారిటీ కన్సల్టింగ్‌- ఇంజినీరింగ్‌ ప్రాక్టీస్‌ ఆవిష్కరణ కోసం సైయెంట్‌- ఇయోలోస్ భాగస్వామ్యం

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (20:32 IST)
అంతర్జాతీయ ఇంజినీరింగ్‌, తయారీ మరియు డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేఫన్‌, సాంకేతిక పరిష్కారాల కంపెనీ సైయెంట్‌ నేడు తాము బెర్లిన్‌ కేంద్రంగా కలిగిన పారిశ్రామిక కన్సల్టెన్సీ, ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్ధ ఇయోలోస్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. వ్యాపార సంస్థలు సుస్థిరమైన, సర్క్యులర్‌ ఎకనమీ దిశగా మారేందుకు ఇయోలోస్‌ తోడ్పడుతుంది. పరిశ్రమలు అత్యుత్తమ సుస్థిరత వైపు మారడానికి మద్దతునందించేలా ఓ ఇంజినీరింగ్‌ ప్రాక్టీస్‌ను సైయెంట్‌ మరియు ఇయోలోస్‌లు సహ అభివృద్ధి చేయనున్నాయి.
 
ఈ భాగస్వామ్యం గురించి కార్తికేయన్‌ నటరాజన్‌, అధ్యక్షుడు మరియు చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, సైయెంట్‌ మాట్లాడుతూ, ‘‘వాతావరణ మార్పులు మరియు డీ-కార్బనైజేషన్‌కు మనం ఏ విధంగా స్పందిస్తామనేది భావితరాల కోసం మన వారసత్వంను నిర్వచిస్తుంది. ఇయోలోస్‌ యొక్క పారిశ్రామిక అనుభవం మరియు సర్క్యులర్‌ ఎకనమీలో వారి నైపుణ్యంతో ఇంజినీరింగ్‌ డిజైన్‌, తయారీ, మార్కెట్‌లో సైయెంట్‌ యొక్క నాయకత్వం కలిసి వినియోగదారుల అవసరాలను తీర్చనున్నాయి..’’ అని అన్నారు.
 
‘‘సైయెంట్‌తో తమ భాగస్వామ్యం పర్యావరణ ప్రభావం తగ్గించేందుకు చేస్తోన్న ప్రయత్నాలలో ఉత్పత్తి డిజైన్‌ మరియు కంపెనీ ప్రక్రియలను మెరుగుపరచడంతో పాటుగా విస్తృతశ్రేణి ఇంజినీరింగ్‌ సామర్థ్యాల పరంగా తమ అనుభవాన్ని పూరిస్తుంది’’ అని ఇయోలోస్‌ సీఈవో అండ్‌ కో-ఫౌండర్‌ పియార్రీ-వెస్‌ కోహెన్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments