Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారి.. కేంద్రానికి విజయ్ మాల్యా విజ్ఞప్తి

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (13:25 IST)
కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విన్నపం చేశారు. బ్యాంకులను మోసం చేసి లండన్‌కు చెక్కేసిన విజయ్ మాల్యా.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. 
 
కరోనా నేపథ్యంలో ఊహించని విధంగా యావత్ దేశాన్ని భారత ప్రభుత్వం లాక్ డౌన్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. లాక్ డౌన్ కారణంగా తన కంపెనీల కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ఉత్పాదన ఆగిపోయింది. మా సంస్థల్లో పని చేస్తున్నవారిని ఇంటికి పంపలేకపోతున్నాం. వారికి తగిన వేతనాలు కూడా చెల్లించలేకపోతున్నాం. ప్రభుత్వం సహకరించాలని ట్వీట్ చేశారు. తమ ఉద్యోగులను ఇంటికి పంపించడానికి సహకరించాలని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తన మాటలను కేంద్ర ఆర్థిక మంత్రి వింటారని ఆశిస్తున్నానని చెప్పారు.
 
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లిస్తానంటూ ఇప్పటికే పలుమార్లు ఆఫర్ చేశానని మాల్యా చెప్పారు. తన నుంచి డబ్బు తీసుకోవడానికి బ్యాంకులు ముందుకు రాలేదని చెప్పుకొచ్చారు. అలాగే అటాచ్ చేసిన తన ఆస్తులను రిలీజ్ చేసేందుకు ఈడీ ముందుకు రాలేదని విజయ్ మాల్యా అసహనం వ్యక్తం చేశారు.
 
భారతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు అణా పైసాతో సహా  చెల్లిస్తానని మాల్యా విజ్ఞప్తి చేశారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తీసుకున్న అప్పు 100 శాతం చెల్లిసానని ట్వీట్ చేశారు. కానీ బ్యాంకులు తన విన్నపాన్ని అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. అటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా పట్టించుకోవడం లేదన్నారు. జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయడం లేదన్నారు. ఈ విషయంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం చేసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments