Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ మండే.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. అంతా లాక్ డౌన్ ఎఫెక్ట్

Webdunia
సోమవారం, 18 మే 2020 (16:32 IST)
భారత స్టాక్ మార్కెట్లకు సోమవారం బ్లాక్ మండేగా మిగిలిపోయింది. లాక్‌డౌన్‌ 4.0 కారణంగా భారత మార్కెట్లు వరుసగా మూడో రోజు పతనమయ్యాయి.  దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, ఏడాది పాటు దివాలా స్మృతి మినహాయింపు మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,068.75 పాయింట్లు నష్టపోయి, 300028.98వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 313.60 పాయింట్ల నష్టంతో 8,823 స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.75.90 వద్ద కొనసాగుతోంది.
 
సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభం అయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 740 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయింది. ఆ తర్వాత ఏ దశలోనూ సూచీలు కోలుకోలేదు. దీంతో చివరకు మార్కెట్లు భారీగా నష్టపోయాయి.

సోమవారం నాటి ట్రేడింగ్‌లో సిప్లా, టీసీఎస్‌, భారతీ ఇన్‌ప్రాటెల్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ తదితర షేర్లు లాభపడగా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌, ఐషర్‌ మోటార్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిస్‌ బ్యాంకు తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments