Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్‌ వెజ్‌ ప్రియులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన చికెన్ ధరలు

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (19:53 IST)
నాన్‌ వెజ్‌ ప్రియులకు గుడ్ న్యూస్. గతకొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతోన్న చికెన్‌ ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. కార్తీక మాసం కావడంతో చికెన్‌ రేటు భారీగా తగ్గింది. కరోనా సమయంలో ప్రజలు చికెన్‌ను విపరీతంగా తినేయడంతో ఒకానొక సమయంలో కిలో చికెన్‌ ధర ఏకంగా రూ. 300 వరకు చేరింది. 
 
అయితే ఇప్పుడు కార్తీక మాసంతో ధరలు ఒక్కసారిగా సగానికి సగం తగ్గాయి. దీంతో ప్రస్తుతం కిలో చికెన్‌ విత్‌ స్కిన్‌ రూ. 170, స్కిన్‌లెస్‌ రూ. 180కి పడిపోయింది. గడిచిన నాలుగు నెలల్లో కిలో చికెన్‌ ధర చేరుకున్న కనిష్ట ధర ఇదే కావడం విశేషం.
 
ఇదిలా ఉంటే కోళ్లు ఒక పరిమాణానికి వచ్చిన తర్వాత కచ్చితంగా వాటిని అమ్మేయాల్సిందే. లేదంటే వాటికి మేత ఎక్కువవడంతో పాటు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి. దీంతో మార్కెట్లో డిమాండ్‌ తగ్గి, భారీగా కోళ్లు రావడంతో ఆటోమేటిగ్‌గా ధర తగ్గుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. 
 
కొన్ని ప్రాంతాల్లో అయితే చికెన్‌ ధరలు ఏకంగా 40 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. కార్తీక మాసం ముగిసే సమయానికి చికెన్ ధరలు ఇలాగే ఉండే అవకాశాలున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఒకవేళ ఈ సమయంలో ఉత్పత్తి తగ్గితే మళ్లీ కార్తీక మాసం ముగిసిన తర్వాత చికెన్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు కూడా లేకపోలేవు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments