చెన్నై-హైదరాబాద్‌‌ల మధ్య బుల్లెట్ రైలు.. తిరుపతి మీదుగా జర్నీ

సెల్వి
మంగళవారం, 25 నవంబరు 2025 (14:54 IST)
చెన్నై-హైదరాబాద్‌‌ల మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు రానుంది. ఈ రైలును తిరుపతి మీదుగా నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు ఖరారు చేసింది. సవరించిన నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికకు సూత్రప్రాయ ఆమోదం లభిస్తే, త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి. 
 
ఈ ప్రాజెక్టు పూర్తయితే 778 కిలోమీటర్ల దూరంలోని చెన్నై-హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం 12 గంటలుగా ఉన్న ప్రయాణం కేవలం 2 గంటల 20 నిమిషాలకు పరిమితం అవుతుందని అధికారులు చెబుతున్నారు. 
 
తొలుత చెన్నై నుంచి గూడూరు మీదుగా హైదరాబాద్‌కు ఈ బుల్లెట్ రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. అయితే, ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి మీదుగా ప్రాజెక్టును అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం రైల్వేకు విజ్ఞప్తి చేసింది. 
 
ఈ ప్రాజెక్టు కోసం ఒక్క తమిళనాడులోనే 223.44 హెక్టార్ల భూమి అవసరమని అక్కడి ప్రభుత్వ కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ నివేదిక ఇచ్చింది. చెన్నై సెంట్రల్, మీంజూరు వద్ద మరో స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments