Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో చేపట్టనున్న బుల్లెట్ రైల్ ప్రాజెక్టులు ఇవే...

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (16:40 IST)
దేశంలో మరో ఏడు మార్గాల్లో బుల్లెట్ రైల్ ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టును చేపట్టారు. 508.17 కిలోమీటర్ల పొడవుగల ఈ ప్రాజెక్టు వచ్చే 2028 నాటికి పూర్తికానుంది. ఈ ప్రాజెక్టుపై స్థల సేకరణతో పాటు కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం పడింది. ఆ కారణంగానే 2023 నాటికి పూర్తకావాల్సిన ప్రాజెక్టు 2028కి పూర్తికానుంది. 
 
ఇవికాకుండా, 865 కిలోమీటర్ల దూరం ఢిల్లీ - వారణాసి, 753 కిలోమీటర్ల దూరం కలిగిన ముంబై - నాగ్‌‌పూర్ మార్గం, 459 కిలోమీటర్ల మార్గం కలిగిన ఢిల్లీ - అమృతసర్, 711 కిలోమీటర్ల పొడవు కలిగిన ముంబై - హైదరాబాద్, 886 కిలోమీటర్ల దూరమున్న ఢిల్లీ - అహ్మదాబాద్, 435 కిలోమీటర్ల దూరం ఉన్న చెన్నై - మైసూర్, 760 కిలోమీటర్ల దూరం కలిగిన వారణాసి - హౌరా మార్గాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందుకోసం కేంద్రం 10 ట్రిలియన్ కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ఇందుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేయాల్సిందిగా కేంద్రం కోరినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments