Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్‌ పునరుద్ధరణ కోసం రూ.1.64 లక్షల కోట్లు

Webdunia
బుధవారం, 27 జులై 2022 (20:11 IST)
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పునరుద్ధరణకు కేంద్రం నడుంబిగించింది. ఇందుకోసం రూ.1.64 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 
 
దేశంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత బీఎస్ఎస్ఎల్‌ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నిజం చెప్పాలంటే బీఎస్ఎన్ఎల్ నానాటికీ బక్కచిక్కిపోతోంది. అలాంటి సంస్థను తిరిగి గాడిన పెట్టేందుకు మోడీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. 
 
ఇందుకోసం రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అంతేకాకుండా, బీఎస్ఎన్ఎల్‌, భారత్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ లిమిటెడ్(బీబీఎన్ఎల్)ను విలీనం చేసేందుకు కూడా ఆమోదం తెలిపింది. ఈ రెండు సంస్థల తర్వాత దేశంలోని మారుమూల గ్రామాల్లో సైతం 4జీ నెట్‌వర్క్ సదుపాయాన్ని కల్పించే దిశగా బీఎస్ఎన్ఎల్ చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం ఈ ప్యాకేజీ నుంచి భారీ మొత్తంలో నిధులు కేటాయించనుంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments