Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండిగో విమాన చౌక ప్రయాణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

తక్కువ ధ‌ర‌కే విమాన ప్ర‌యాణం, ఉచిత విమ‌నా ప్ర‌యాణం వంటి వార్త‌లు చాలా వ‌స్తుంటాయి. అందులో చాలావ‌ర‌కు అస‌త్య వార్త‌లే. అయితే ఇది మాత్రం అటువంటిది కాదు. రూ.1,212కే విమాన ప్ర‌యాణం చేసే అవ‌కాశాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ క‌ల్పిస్తోంది. ఆ సంస్థ 12వ వార

Webdunia
బుధవారం, 11 జులై 2018 (11:13 IST)
తక్కువ ధ‌ర‌కే విమాన ప్ర‌యాణం, ఉచిత విమ‌నా ప్ర‌యాణం వంటి వార్త‌లు చాలా వ‌స్తుంటాయి. అందులో చాలావ‌ర‌కు అస‌త్య వార్త‌లే. అయితే ఇది మాత్రం అటువంటిది కాదు. రూ.1,212కే విమాన ప్ర‌యాణం చేసే అవ‌కాశాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ క‌ల్పిస్తోంది. ఆ సంస్థ 12వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా 12 ల‌క్ష‌ల టికెట్ల‌ను రాయితీ ధ‌ర‌ల‌పై విక్ర‌యించ‌నుంది. 
ఇందులో అత్యంత త‌క్కువ ధ‌ర రూ.1,212. ఈ డిస్కౌంట్‌ టిక్కెట్లు 2018 జూలై 25 నుంచి 2019 మార్చి 30 వరకు ప్రయాణ కాలానికి వర్తించనున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఇండిగో సేల్‌ మంగళవారం నుంచి ప్రారంభ‌మ‌యింది. శుక్రవారంతో ముగుస్తుంది. ఈ సేల్‌ వివరాలను ఇండిగో క్యారియర్‌ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆ విమానాలు న‌డిచే అన్ని రూట్ల‌లోనూ రాయితీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. 
 
తక్కువ విమాన టిక్కెట్‌ ఛార్జీలే కాక, ఈ ఎయిర్‌లైన్‌ ఎస్‌బీఐ కార్డు ద్వారా పేమెంట్లు జరిపే బుకింగ్స్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ అందించనున్నట్టు కూడా పేర్కొంది. అయితే కనీస లావాదేవీ రూ.3000 మేర ఉండాలి. ఒక్కొక్కరికి 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. 2018 సెప్టెంబర్‌ 14న క్యాష్‌బ్యాక్‌ మొత్తాన్ని కస్టమర్ల అకౌంట్‌లో క్రెడిట్‌ చేయనున్నారు. ఆగస్టు 4న ఇండిగో 12వ ఏటా అడుగుపెడుతోంది. 
 
ఈ సందర్భాన్ని తీపి గుర్తుగా మరలుచుకునేందుకు 12 లక్షల సీట్లను ప్రత్యేక ధరల్లో అందుబాటులో ఉంచాం…. అని ఆ సంస్థ ప్ర‌క‌టించింది. దేశీయంగా ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ. ప్రస్తుతం 1,086 రోజువారీ విమానాలను ఇది ఆపరేట్‌ చేస్తోంది. 42 దేశీయ, 8 అంతర్జాతీయ మార్గాలను ఇది కనెక్ట్‌ చేస్తోంది.  గో ఎయిర్‌ ఏసియా, స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థలు విమాన టిక్కెట్లపై డిస్కౌంట్‌ సేల్‌ ప్రకటించిన అనంతరం ఇండిగో ఈ ఆఫర్‌ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments