కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న బడ్జెట్లో వేతన జీవులకు పెద్ద వరం కురిపిస్తారనుకుంటే అదేమీ లేదని తేల్చేశారు. తొలుత ఆదాయ పన్ను పరిమితి ఏకంగా రూ. 5 లక్షల వరకూ పెంచుతారని అనుకున్నప్పటికీ ఇంతకుముందున్న ప్రకారమే పన్ను కొనసాగుతుందని ప్రకటించారు.
ఇంకా... మహిళల అభివృద్ధికి అన్ని జిల్లాల్లో పథకాలు. జన్‌ధన్ ఖాతా కలిగిన మహిళలకు రూ.5వేలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం
చిల్లర వ్యాపారులకు నూతన పింఛన్ పథకం... ప్రధాన మంత్రి కర్మయోగి మాన్‌ధన్ యోజన ద్వారా చిల్లర వర్తకులకు పింఛన్
81 లక్షల గృహాలను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం.. మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన