Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2019, ఇప్పటివరకూ హైలెట్స్ ఇవే...

నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2019, ఇప్పటివరకూ హైలెట్స్ ఇవే...
, శుక్రవారం, 5 జులై 2019 (12:07 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ 2019 ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకూ ఆమె వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి. 
 
జీరో-బడ్జెట్ వ్యవసాయం.. తిరిగి మూలాలకు వెళ్లాలి
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ (సులభ వ్యాపారం – సులభ జీవనం) అనేవి రైతులకు కూడా వర్తించాలి.
జీరో-బడ్జెట్ వ్యవసాయం మూలాలకు మనం తిరిగి వెళ్లాలి. దేశమంతటా ఈ నమూనాను విస్తరించాలి.
ఇటువంటి చర్యలు 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయి.
 
ఫేమ్-2 పథకంతో విద్యుత్ వాహనాల వినియోగం పెంపు
సరైన ప్రోత్సాహకాలు అందించటం, చార్జింగ్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటం ద్వారా విద్యుత్ వాహనాలను ఉపయోగించటం వేగంగా పెంచటానికి ఫేమ్-2 పథకం అమలు.
1.25 లక్షల కిలోమీటర్ల రోడ్ల స్థాయిని పెంచుతాం.
 
2021 నాటికి 1.95 కోట్ల ఇళ్ల నిర్మాణం
భారతదేశ ఆత్మ గ్రామాల్లో నివసిస్తోందని మహాత్మా గాంధీ అన్నారు. గావ్, గరీబ్, కిసాన్ – కేంద్రంగా కృషి చేస్తున్నాం.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2021 నాటికి 1.95 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదన.
2022 నాటికి అన్ని ఇళ్లకూ విద్యుత్, ఎల్‌పీజీ (వంట గ్యాస్) అందిస్తాం.
 
అందరికీ వంట గ్యాస్
దేశంలో ఉన్న అందరికీ వంట గ్యాస్ సదుపాయం కల్పిస్తామని, ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా తీసుకోకపోతే తప్ప ప్రజలందరికీ వంట గ్యాస్ అందుతుందన్నారు.
 
అంతరిక్ష విజయాల నుంచి వాణిజ్య ప్రయోజనాలు
భారతదేశం ఒక ప్రధాన అంతరిక్ష శక్తిగా అవతరించింది. ఈ సామర్థ్యాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇస్రో పరిశోధన, అభివృద్ధి ప్రయోజనాలను పొందటానికి స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ సంస్థను కొత్తగా నెలకొల్పాం. వివిధ అంతరిక్ష ఉత్పత్తులను వాణిజ్యపరంగా మలచే కార్యక్రమానికి ఈ సంస్థ సారథ్యం వహిస్తుంది.
 
విమానయానం, మీడియా, బీమా రంగాల్లో ఎఫ్‌డీఐ పెంపు చర్యలు
విమానయానం, మీడియా, బీమా రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని పెంచే చర్యలను మోదీ ప్రభుత్వం పరిశీలిస్తుంది. దుకాణదారుల కోసం కొత్త పెన్షన్ పథకం. మూడు కోట్ల మంది దుకాణదారుల కోసం కొత్త పెన్షన్ పథకం.. ప్రధానమంత్రి కరమ్‌యోగి మాన్‌ధన్ స్కీమ్. దీనికోసం ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు మాత్రమే అవసరం.
webdunia
 
రైల్వేల్లో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు
దేశంలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా పెట్టుబడులు పెడతామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2018 నుంచి 2030వ సంవత్సరం వరకు దేశంలో రైల్వేల అభివృద్ధికి 50 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, ప్రతి ఏటా 1.5 నుంచి 1.6 లక్షల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం పెట్టుబడి పెడితే ఇప్పటికే మంజూరు చేసిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకే దశాబ్ధాల సమయం పడుతుందని చెప్పారు. 
 
అందుకే రైల్వేలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు తాము ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిని ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. ‘‘రైల్వేల్లో వేగవంతమైన అభివృద్ధికి, రైల్వే లైన్ల నిర్మాణానికి, రోలింగ్ స్టాక్ ఉత్పత్తికి, ప్రయాణీకులు, సరకు రవాణా సేవల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిని ప్రతిపాదిస్తున్నాం’’ అని సీతారామన్ చెప్పారు.
 
నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు
నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు.జాతీయ భద్రతకు
 
ఆమె ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
‘‘ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చేటప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల కోట్లుగా ఉంది.
ప్రస్తుతం 2.5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.
ఐదేళ్లలోనే దేశ ఆర్థిక వ్యవస్థ విలువనులక్ష కోట్ల డాలర్లకు పెంచాం.
మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదిగింది. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
ఐదు లక్షల డాలర్ల ఆర్థఇక వ్యవస్థగా అవతరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.’’

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్లమెంట్‌కు నిర్మలా సీతారామన్ తల్లిదండ్రులు.. చాణక్య నీతిని గుర్తుచేస్తూ...?