మొబైల్స్ తయారీదారు సంస్థ వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్ జడ్1 ప్రొను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్‌తో పాటు 32 మెగాపిక్సెల్ ఇన్‌స్క్రీన్ కెమెరాను అమర్చారు. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ గల బ్యాటరీని ఇందులో పొందుపరిచారు. ఈ ఫోన్‌కి సంబంధించిన ధరలను సైతం ఆ సంస్థ ప్రకటించింది.
4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ధర రూ.14,990 ఉండగా, 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.16,990గా ఉంది. ఇక 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ.17,990గా నిర్ణయించారు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 11వ తేదీ నుండి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. ఐసీఐసీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన వారికి రూ.750 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు జియో కస్టమర్‌లకు రూ.6వేలు విలువైన ప్రయోజనాలు లభిస్తాయి.
వివో జడ్1ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు:
6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,
2340 x 1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్,
4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై,
16, 8, 2 మెగాపిక్సెల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0,
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలదు.