Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండిగో విమాన టిక్కెట్లపై ఆఫర్లు... రూ.1099కే ప్రయాణం

దేశవాళీ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు విమాన ప్రయాణ టిక్కెట్లపై సూపర్ ఆఫర్లు ప్రకటించింది. ప్రాంతాల మధ్య తక్కువ చార్జీలను ప్రకటించింది. ఈ కనీస చార్జీని రూ.1,099 నుం

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (15:29 IST)
దేశవాళీ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు విమాన ప్రయాణ టిక్కెట్లపై సూపర్ ఆఫర్లు ప్రకటించింది. ప్రాంతాల మధ్య తక్కువ చార్జీలను ప్రకటించింది. ఈ కనీస చార్జీని రూ.1,099 నుంచి టికెట్లను అందుబాటులో ఉంచింది. ఢిల్లీ - జైపూర్ రూట్‌లో ఈ ధర వర్తిస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 
 
అలాగే, వైజాగ్ - హైదరాబాద్ మధ్య రూ.1,249ని ప్రయాణ టిక్కెట్‌గా నిర్ణయించింది. ఇక చెన్నై - బెంగళూరు మధ్య రూ.1,120, జమ్మూ - శ్రీనగర్ మధ్య రూ.1,168, వడోదరా - గౌహతీ మధ్య రూ.1,227, అగర్తలా - గౌహతీ మధ్య రూ.1,249, బెంగళూరు - చెన్నై మధ్య రూ.1,285, గోవా - బెంగళూరు మధ్య రూ.1,316 టికెట్లను అందుబాటులోకి ఉంచినట్టు పేర్కొంది. 
 
అయితే, వైజాగ్ - హైదరాబాద్‌ల మధ్య అక్టోబరు నెలలో అనేక తేదీల్లో టిక్కెట్లు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 11, 12, 15, 17, 19, 27, 29, 31 తేదీల్లో చౌక ధరకు టికెట్లు ఉన్నాయి. సాధారణంగా అయితే, ఈ రెండు నగరాల మధ్య సూపర్ లగ్జరీ బస్సు టికెట్ రూ.746 కాగా, ప్రయాణ సమయం 14 గంటలు. అలాగే గరుడ ప్లస్ సర్వీస్ అయితే, రూ.1,171 టికెట్ ధర కాగా, 12 గంటల సమయం పడుతుంది. ముందుగా ప్లాన్ చేసుకుంటే ఈ మార్గంలో అదనంగా రూ.100 చెల్లిస్తే గంటన్నర వ్యవధిలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఈ ప్రయాణ టిక్కెట్ ధరలు పన్నులతో కలుపుకుని.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments