Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నంద్యాల కౌంటింగ్ స్టార్ట్ : తొలి రౌండ్‌లో టీడీపీ అధిక్యం

టీడీపీ, వైకాపాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల పోరును 2019 ఎన్నికలకు సెమీఫైనల్‌గా ఇటు అధికార టీడీపీ, అటు విపక్ష వైకాపా

నంద్యాల కౌంటింగ్ స్టార్ట్ : తొలి రౌండ్‌లో టీడీపీ అధిక్యం
, సోమవారం, 28 ఆగస్టు 2017 (08:50 IST)
టీడీపీ, వైకాపాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల పోరును 2019 ఎన్నికలకు సెమీఫైనల్‌గా ఇటు అధికార టీడీపీ, అటు విపక్ష వైకాపాలు ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 
 
ఈ ఓట్ల లెక్కింపు తొలి రౌండ్‌లో అధికార టీడీపీకి 1295 ఓట్లు మెజార్టీ వచ్చింది. టీడీపీకి 5474 ఓట్లు పోలుకాగా, వైకాపాకు 4179 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 69 ఓట్లు పోలయ్యాయి. ఈ ఫలితం 11 గంటలకల్లా తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఉప ఎన్నిక పోరును అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈ ఎన్నికను 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించే పరిస్థితి ఏర్పడింది. ఈ ఫలితం కోసం రెండు తెలుగు రాష్ట్రాలూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. 
 
కాగా,నంద్యాల బరిలో మొత్తం 15 మంది బరిలో ఉన్నారు. ఈనెల 23న జరిగిన ఎన్నికలో 79.13 శాతం పోలింగ్‌ నమోదైంది. నంద్యాల అర్బన్‌లో మొత్తం 1,42,628 ఓట్లకుగాను 1,05,484 ఓట్లు పోలయ్యాయి. నంద్యాల రూరల్‌లో 47,386 ఓట్లకుగాను 41,512 ఓట్లు పోలయ్యాయి. గోస్పాడు మండలంలో మొత్తం 28,844 ఓట్లకుగాను 26,193 ఓట్లు పోలయ్యాయి. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాలలో ఓట్లు లెక్కిస్తారు. 
 
మొత్తం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 19 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద, పట్టణంలోనూ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా, ఉప ఎన్నిక ఫలితంపై వందల కోట్లలో పందేపు రాయుళ్లు పందేలు కాశారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలోని బళ్లారిలోనూ బెట్టింగ్‌లు జోరుగా సాగాయి. ఫలితం వెలువడే సమయం దగ్గరపడటంతో బెట్టింగ్‌రాయుళ్లలో ఉత్కంఠ నెలకొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాపులను రంపానపెట్టింది.. చంద్రబాబే.. పవన్ న్యూట్రల్‌గా వున్నారు: రోజా