Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నంద్యాల వైపు చూడాలంటే జగన్ భయపడతారు... అలాంటి రిజల్ట్... అఖిల ప్రియ

నంద్యాల నియోజకవర్గం వైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూడాలంటేనే భయపడే రిజల్ట్ వస్తుందని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. నంద్యాల ప్రజలంతా తన తల్లిదండ్రులపై గౌరవంతో తమ వెంటే వున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ పోలింగ్ ఇంతటి భారీ స్థాయిలో జరిగిందంటే దానికి కారణం.

Advertiesment
నంద్యాల వైపు చూడాలంటే జగన్ భయపడతారు... అలాంటి రిజల్ట్... అఖిల ప్రియ
, బుధవారం, 23 ఆగస్టు 2017 (20:33 IST)
నంద్యాల నియోజకవర్గం వైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూడాలంటేనే భయపడే రిజల్ట్ వస్తుందని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. నంద్యాల ప్రజలంతా తన తల్లిదండ్రులపై గౌరవంతో తమ వెంటే వున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ పోలింగ్ ఇంతటి భారీ స్థాయిలో జరిగిందంటే దానికి కారణం.... ప్రజలందరూ కదిలి వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడమేనని అన్నారు. 
 
ఇకపోతే... జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని చంపాలన్నందుకు జగన్‌పై కేసు నమోదు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 
 
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలనీ, ఉరి తీయాలనీ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. సాక్షాత్ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై జగన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. 
 
ఈ వ్యవహారంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జగన్‌పై కేసు నమోదు చేయాలంటూ అధికారులను ఆదేశించింది. ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై కాల్చినా తప్పులేదన్న జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య దేశంలో అభ్యంతరకరమని తెలిపింది. జగన్ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడులో రోజాను మించిన ఐరన్ లెగ్... ఎవరు..?