Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయింగ్ విమానం ఇలా కూలింది... బాబోయ్ అంటున్న ప్రపంచ దేశాలు(ఫోటోలు)

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (17:13 IST)
ప్రపంచ విమానయాన రంగాన్ని ప్రస్తుతం కేవలం రెండే సంస్థలు శాసిస్తున్నాయి. అందులో ఒకటి ఎయిర్‌బస్ కాగా మరొకటి బోయింగ్. ఇప్పటికీ ఈ రెండు సంస్థలే విమానయాన రంగాన్ని తమ గుప్పిట్లో ఉంచుకున్నాయి. ఇంతకుముందు ఎయిర్‌బస్‌కు చెందిన ఏ380 మోడల్ విఫలం కావడంతో ఆ సంస్థ వాటి తయారీని నిలిపివేసాయి. అయితే దీని వల్ల ఆ సంస్థ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. 
 
ఇప్పుడు ఆ పరిస్థితులు బోయింగ్ ఎదుర్కొంటున్నది. బోయింగ్ విమానాలు కూలిపోతుండటంతో అనేక దేశాలు వాటిని నిషేధిస్తున్నాయి. ఇటీవల ఇథియోపియాకు చెందిన బోయింగ్ 737 మాక్స్8 విమానం గాల్లోకి ఎగిరిన నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలింది, ఆరు నెలల క్రితం ఇండోనేషియాకు చెందిన ఇటువంటి విమానమే బయలుదేరిన పది నిమిషాలకే సముద్రంలో కూలిపోయింది.


అయితే ఈ రెండు విమానాలూ చాలా కొత్తవి కావడం విశేషం. బోయింగ్ విమానాలకు వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో అనేక దేశాలు ఈ మోడల్ విమానాలపై అనుమానాలు వ్యక్తం చేసాయి. కొన్ని దేశాలు వాటిని సస్పెండ్ చేయగా మరికొన్ని పూర్తిగా నిలిపివేసాయి.
 
ప్రపంచ దేశాలు బోయింగ్ 737 మాక్స్ మోడల్ విమానాలను నిషేధిస్తుండటంతో మార్చి 11వ తేదీ తర్వాత నుండి బోయింగ్ షేరు విలువ 10 శాతం పడిపోయింది. 2019లో బోయింగ్ కంపెనీ డెలివరీ చేయాల్సిన విమానాల్లో 90 శాతం 737 మాక్స్ మోడల్‌కు చెందినవే కావడంతో ఆ కంపెనీకి ఈ ఏడాది మరింత నష్టాలు వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments