Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు!!

సెల్వి
సోమవారం, 29 జులై 2024 (14:25 IST)
ఈ సంవత్సరంలో మరో నెల కాల చక్రంలో కలిసిపోనుంది. జూలై నెల మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఆగస్టు నెలలో పలు ఆర్థికపరమైన నిబంధనలు, మార్పులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా, ఎల్‌పీజీ సిలిండర్‌ ధర, క్రెడిట్‌ కార్డు రూల్స్‌ వంటివి అందులో ఉన్నాయి. వీటితో పాటు వచ్చే నెల బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు రాబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 
 
ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 13 రోజులు సెలవులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో వచ్చే సెలవులతో కలుపుకొంటే 8 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానునున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న, కృష్ణాష్ణమి సందర్భంగా ఆగస్టు 26న బ్యాంకులు తెరుచుకోవు. రెండు, నాలుగో శని వారాలు, ఆదివారం బ్యాంకులకు ఎలానూ సెలవే. దాని బట్టి మీ బ్యాంకు పనులను ప్లాన్‌ చేసుకోండి.
 
అలాగే, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ ధరలను ప్రతినెలా ఒకటో తేదీన సవరిస్తూ ఉటారు. గత నెల 19 కేజీల కమర్షియల్ గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గించారు. అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉండడంతో మరోసారి తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.
 
ఇకపోతే, ప్రైవేటురంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఇకపై క్రెడ్‌, చెక్‌, మోబిక్విక్‌, ఫ్రీఛార్జ్‌ వంటి వేదికల ద్వారా అద్దె చెల్లిస్తే శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. రూ.15 వేలు పైబడి చేసే ఫ్యూయల్‌ చెల్లింపులకూ ఒక శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments