Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో సమృద్ధి మేళాను నిర్వహిస్తోన్న యాక్సిస్‌ బ్యాంక్‌

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (20:50 IST)
భారతదేశంలో మూడవ అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, తమ బ్యాంకు అందించే పలు ఋణావకాశాలు, పథకాలను గురించి నెటిజన్లకు అవగాహన కల్పించే లక్ష్యంతో సమృద్ధి మేళాను నిర్వహిస్తోంది. ఈ మేళాను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 8 యాక్సిస్‌ బ్యాంక్‌ శాఖల వద్ద నిర్వహిస్తోంది.


ఈ కార్యక్రమం ద్వారా బ్యాంక్‌ గ్రామాలు, పట్టణాలలోని వినియోగదారులకు విభిన్నమైన ఋణాలైనటువంటి వ్యవసాయ, వ్యాపార, వాణిజ్య వాహన, ద్విచక్ర, ట్రాక్టర్‌, గృహ, బంగారం తదితర ఋణాల పట్ల అవగాహన కలిగిస్తోంది. ఈ సమృద్ధి మేళాను 10 రోజుల పాటు ఆగస్టు 17, 2022వ తేదీ నుంచి నిర్వహిస్తోంది. ఈ మేళాలను ఆంధ్రప్రదేశ్‌లో బాపట్ల, చీరాల, వినుకొండ, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, అద్దంకి, గురజాలలలో నిర్వహిస్తున్నారు.

 
తమ అవగాహన కార్యక్రమాలను మరింతగా విస్తరిస్తూ, బ్యాంక్‌ ఉద్యోగులు గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యక్రమాలు, మార్కెట్‌ యార్డులు/మండీలు/హాత్స్‌ మొదలైనవి సైతం సందర్శించడంతో పాటుగా అందుబాటులోని ఆర్ధిక పరిష్కారాలను గురించి అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బ్యాంక్‌ తమ భారత్‌ బ్యాంకింగ్‌ వ్యూహాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటుగా టియర్‌ 4, 5 నగరాలలో అధిక సంఖ్యలో వినియోగదారులకు చేరుకోనుంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments