Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఎస్‌సీఐ నివేదిక: ఏఐని స్వీకరిస్తున్న భారతీయ ప్రకటనల పరిశ్రమ

ఐవీఆర్
గురువారం, 20 మార్చి 2025 (22:38 IST)
ముంబై: ముంబైలో జరిగిన ఐసీఏఎస్ గ్లోబల్ డైలాగ్స్ సమ్మిట్ సందర్భంగా జరిగిన గ్లోబల్ అడ్డా కార్యక్రమంలో తన తాజా నివేదిక ‘యాడ్ నెక్ట్స్: ది ఏఐ ఎడిషన్’ విడుదల చేసినట్లు అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ) అకాడమీ ప్రకటించింది. ఇది ప్రకటనల పరిశ్రమపై ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రభావంపై లోతైన అన్వేషణ. ముఖ్యంగా డైనమిక్ భారతీయ మార్కెట్‌పై దృష్టి సారిస్తుంది. బ్రాండ్లు వినియోగదారులతో అనుసంధానం కావడాన్ని, ప్రచారాలను గరిష్ఠ ప్రయోజనం పొందే లా చేయడం, అనుభవాలను వ్యక్తిగతీకరించడం లాంటి వాటిని ఏఐ ప్రాథమికంగా పునర్నిర్మిస్తున్నందున ఈ నివేదిక ఒక కీలకమైన దశలో వెలువడినట్లయింది.
 
ఈ అధ్యయనాన్ని డిజైన్ టెక్ సంస్థ పారలల్ హెచ్‌క్యూ నిర్వహించింది. గూగుల్, గేమ్స్ 24X7 మద్దతుతో జరిగిన ఈ అధ్యయనం ఏఎస్‌సీఐ అకాడమీలో ఆలోచనా నాయకత్వ పనిలో భాగం. దీనికి డియాజియో, హిందుస్థాన్ యూనిలీవర్ మోండెలెజ్, నెస్లే, సిప్లా హెల్త్, కోకా-కోలా, కోల్గేట్, పెప్సికో, పి&జి, కెన్వ్యూ, బజాజ్ ఆటో, డ్రీమ్ స్పోర్ట్స్ మద్దతు ఇస్తున్నాయి. డిజిటల్ పర్యావరణ వ్యవస్థలోని బ్రాండ్లు, ఏజెన్సీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, నియంత్రణ సంస్థలు, సాంకేతిక ఆవిష్కర్తలతో సహా 27 మందికి పైగా భారతీయ ప్రముఖులు, ఆలోచనా నాయకుల దృక్పథాలను ఈ నివేదిక ఒకచోట చేర్చింది. ప్రాథమిక అధ్యయనం, ఫోకస్ గ్రూపులు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, ద్వితీయ అధ్యయనం, అభిప్రాయ కథనాల కలయిక ద్వారా, ఈ నివేదిక, ప్రకటనలలో ఏఐ అందించే అవకాశాలు, సవాళ్ల గురించి సూక్ష్మస్థాయి అవగాహనను అందిస్తుంది.
 
ప్రకటనల రంగంలో ఏఐ యొక్క అభివృద్ధి చెందుతున్న పాత్ర సమగ్ర అవలోకనాన్ని అందించడానికి ఈ నివేదిక నాలుగు కీలక రంగాలను అన్వేషిస్తుంది.
 
ఏఐపై అవగాహన: సమర్థత, వ్యక్తిగతీకరణను పెంచే దాని సామర్థ్యాన్ని నిపుణులు గుర్తించడంతో ప్రకటనలలో ఏఐ ఏకీకరణ చుట్టూ ఉన్న ఆశావాద దృక్పథాన్ని ఈ నివేదిక ప్రముఖంగా చాటి చెబుతుంది. మానవ సృజనాత్మకతను భర్తీ చేయడంలో కాకుండా, దాన్ని పెంపొందించడంలో ఏఐ యొక్క నిజమైన బలం ఉందని అర్థం చేసుకోవడం ఒక ముఖ్యమైన అధ్యయన ఫలితం. ఇది ప్రకటనదారులు ఆకర్షణీయమైన, సూక్ష్మమైన కథనాలను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది.
 
పరిశ్రమ స్వీకరణ, సంసిద్ధత: భారతదేశంలోని వివిధ రంగాలలో ఏఐ స్వీకరణ ప్రస్తుత తీరుతెన్నులను ఈ నివేదిక పరిశీలించింది. సుదీర్ఘ కాలంగా ఉంటున్న రంగాలతో పోలిస్తే డిజిటల్-నేటివ్ పరిశ్రమలు వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని అప్లికేషన్ల ద్వారా ఏఐని ఏకీకృతం చేయ డానికి సృజనాత్మక మార్గాలను కనుగొంటూ వాటి ప్రధాన కార్యకలాపాలలో ఏఐని మరింత సజావుగా పొందుపరుస్తున్నాయని నివేదిక పేర్కొంది.
 
వినియోగదారుల ప్రభావం- గోప్యత: ఈ విభాగం ఏఐ-ఆధారిత సాంకేతికతల పట్ల, ముఖ్యంగా ప్రకటనలలో భారతీయ వినియోగదారుల ప్రత్యేక సంసిద్ధతను అన్వేషిస్తుంది, అధునాతన ఏఐ ప్రకటనల వ్యూహాలకు భారతదేశాన్ని సంభావ్య పరీక్షా కేంద్రంగా ఉంచుతుంది.
 
బాధ్యతాయుతమైన ఏఐ ఇంటిగ్రేషన్: వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సందర్భంలో రక్షణ కవచాల అవసరాన్ని గుర్తిస్తూ, ప్రకటనలలో ఏఐ అభివృద్ధి, విస్తరణకు మార్గనిర్దేశం చేయడానికి బాధ్య తాయుతమైన ఏఐ ఫ్రేమ్‌వర్క్‌లు, సూత్రాలు ఉండాలని నివేదిక పేర్కొంది. ఏఎస్‌సీఐ సీఈఓ- సెక్రటరీ జనరల్ మనీషా కపూర్ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో ప్రకటనల పరిశ్రమ మరింత వినూత్నంగా ఉండేందుకు, వినియోగదారులతో మరింత అర్థవంతమైన మార్గాల్లో అనుసంధానం అవడానికి ఏఐ ఆగమనం అపూర్వమైన అవకాశాన్ని అందిస్తుంది. అయితే, ఈ శక్తిని పారదర్శకత, జవాబుదారీతనం,  వినియోగదారులలో శాశ్వత నమ్మకాన్ని పెంపొందించడంపై దృష్టి సారించి బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. ‘యాడ్ నెక్ట్స్: ది ఏఐ ఎడిషన్’ ఈ సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడానికి, ముందుకు సాగడానికి ఒక వనరుగా పనిచేస్తుంది’’ అని అన్నారు.
 
‘‘ఏఐ పరిశ్రమలను వేగంగా పునర్నిర్మిస్తోంది. ప్రకటనలు కూడా దీనికి మినహాయింపు కాదు. ఏఐ భవిష్యత్తులో పెట్టుబడి పెట్టిన డిజైన్ స్టూడియోగా, ఈ పరిశోధనలో భాగస్వామ్యం కావడం అనేది ఏఐ స్వీకరణ, ప్రభావం, నియంత్రణ సమస్యలను అన్వేషించడానికి ఒక ఉత్తేజకరమైన అవకాశం. బాధ్యతాయుతమైన పరిశ్రమ పద్ధతులను రూపొందించడంలో ఏఎస్‌సీఐ ఎల్లప్పుడూ ముందుంది. ఈ నివేదికనే దానికి నిద ర్శనం- ఏఐని బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా స్వీకరించడానికి పరిశ్రమకు ఒక రోడ్‌మ్యాప్‌ను ఇది అందిస్తోంది" అని పారలల్ వ్యవస్థాపకుడు, సీఈఓ రాబిన్ ధన్వానీ అన్నారు.
 
నివేదిక ముఖ్యాంశాలు:
సంస్థలలో ఏఐ ఇంటిగ్రేషన్ విస్తృత పరిశీలన.
పరిశ్రమ వ్యాప్తంగా బాధ్యతాయుతమైన ఏఐ ఫ్రేమ్‌వర్క్‌ల అవసరాన్ని ఏకగ్రీవంగా గుర్తించడం.
విజయవంతమైన ఏఐ ఫలితాల కోసం పటిష్ఠ పాలనా చట్రాల ప్రాముఖ్యత.
జనరేటివ్ ఏఐ యొక్క ప్ర ప్రభావాన్నిఎస్ఎంఈలకు అందుబాటులోకి తీసుకురావడం.
వినియోగదారుల సన్నద్ధత కారణంగా ఏఐ ప్రకటనల ఉత్పత్తులకు ప్రపంచ పరీక్షా కేంద్రంగా భారతదేశం యొక్క సామర్థ్యం.
 
ఏఐ సృష్టిస్తున్న ప్రభావాన్ని తట్టుకునేందుకు కీలక వాటాదారులు నిరంతర చర్చలలో పాల్గొనడం, పరిశోధనలో పెట్టుబడి పెట్టవలసిన అవసరాన్ని ఈ నివేదిక వివరిస్తుంది. వ్యాపార సంస్థలు, వినియోగదారులు ఇద్దరికీ సమానంగా సేవలు అందించే సాంకేతికత భవిష్యత్తును రూపొందించడంలో ఏఐ  బాధ్యతాయుతమైన ఉపయోగం కోసం పరిశ్రమ-వ్యాప్త చట్రాలను రిఫైన్ చేయడం, మెరుగుపర్చడం చాలా అవసరం.
 
గ్లోబల్ అడ్డా కార్యక్రమంలో నివేదిక విడుదల చేసిన తర్వాత, నివేదికలోని అంశాలపై పారలల్ హెచ్‌క్యూ తరఫున ఒక ప్రజెంటేషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకటనలు, నావిగేటింగ్ ఆవిష్కరణలు, బాధ్యతలలో ఏఐ భవిష్యత్తుపై డైనమిక్ ప్యానెల్ చర్చ కూడా జరిగింది. ఖైతాన్ అండ్ కో నుండి తను బెనర్జీ, గూగుల్ నుండి కునాల్ గుహా, గేమ్స్ 24x7 నుండి సమీర్ చుగ్, పిపాల్ మాజిక్ నుండి చంద్రదీప్ మిత్రా మరియు BBB నేషనల్ ప్రోగ్రామ్స్ నుండి మేరీ ఎంగిల్ వంటి వక్తలు ఏఐ సరిహద్దులను మరింత ముందుకు తీసుకెళ్లడం, బాధ్యతాయుతమైన పద్ధతులు, డేటా గోప్యత, వినియోగదారుల నమ్మకాన్ని నిర్ధారించడం మధ్య సమతుల్యతను అన్వేషించారు.

మానవ సృజనాత్మకత, బాధ్యతాయుతమైన ప్రకటనలపై ఏఐ ప్రభావం, ఏఐ పద్ధతులను రూపొందించడంలో స్వీయ-నియంత్రణ సంస్థల పాత్రను కూడా ఈ చర్చ ప్రస్తావిం చింది. అంతేగాకుండా, సీఎన్‌బీసీ టీవీ 18కు చెందిన శిబానీ ఘరత్‌తో జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణలో, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ(MeitY) అదనపు కార్యదర్శి శ్రీ అభిషేక్ సింగ్  భారతదేశంలో ఏఐ ప్రస్తుత స్థితి, ప్రకటనలలో దాని పెరుగుతున్న పాత్రపై తన దృక్పథాన్ని పంచుకున్నారు, వ్యక్తిగతీకరించిన కంటెంట్, లక్ష్యం, ప్రేక్షకుల నిమగ్నతపై ఏఐ పరివర్తన ప్రభావాన్ని చర్చించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments