Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ మార్కెట్‌లోకి ఐఫోన్ 14 సిరీస్ - యాపిల్ వాచ్ కూడా..

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2022 (08:49 IST)
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారతీయ మార్కెట్‌‍లోకి సరికొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. వీటిలో యాపిల్ ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్ అలాగే మరికొన్ని వస్తువులను బుధవారం ఆవిష్కరించింది. ఐపోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్లస్ పేర్లు కూడా ఉన్నాయి. ఈ నాలుగు మోడళ్లను భారతీయ మొబైల్ మార్కెట్‌లోకి యాపిల్ కంపెనీ విడుదల చేసినట్టు ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. 5జీ ఆధారిత కనెక్టివిటీ, ఈ-సిమ్, క్రాష్ డిటెక్షన్, నెట్‌వర్క్ కనెక్టివిటీ లేని చోట కూడా శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ సర్వీస్ వంటి ఫీచర్లతో ఈ ఫోను డిజైన్ చేశారు. పైగా, ఈ ఫోను ఐదు రంగల్లో లభ్యంకానుంది. 
 
ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ వేరియంట్లను ఏ15 బయోనిక్ చిప్‌లతో డిజైన్ చేయగా, ప్రో సిరీస్ వేరియంట్లను మాత్రం ఆధునిక ఏ16 బయోనిక్ చిప్‌తో అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. అదేవిధంగా యాపిల్ వాచ్ 8 సిరీస్‌ను కూడా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. 
 
ఈసీజీ సెన్సర్, బాడీ టెంపరేచర్ సెన్సర్, వెహికల్ క్రాష్ సెన్సర్, మహిళల రుతుక్రమంమపై ఖచ్చితమైన సమాచారం అధించడంతో పాటు మరిన్ని అత్యాధునిక ఫీచర్లు ఉండగా, ఒక్కసారి చార్జిచేస్తే ఏకంగా 36 గంటల పాటు పని చేస్తుంది. ఇంటర్నేషనల్ రోమిగ్‌కు కూడా సపోర్ట్ చేయగలదు. ఈ వాచ్ నాలుగు రంగుల్లో లభిస్తుంది. వీటిని బుధవారం నుంచి బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 16వ తేదీ నుంచి సేల్స్ ప్రారంభంకానున్నాయి. 
 
అలాగే, రెండో తరం ఎయిర్‌పాడ్స్ ప్రోను కూడా యాపిల్ అందుబాటులోకి తెచ్చింది. యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్, టచ్ కంట్రోల్, స్పాషియల్ ఆడియో వంటి ఆధునిక ఫీచర్లతో డిజైన్ చేశారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 30 గంటల వరకు పని చేస్తుంది. ధర రూ.249 డాలర్లుగా నిర్ణయించారు. ఈ నెల 9వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభంకానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments