Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 1 నుంచి ప్యాసింజర్ రైళ్ళ రాకపోకలు : రైల్వే శాఖ

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (18:49 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత యేడాది మార్చి నెల నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రకాల ప్యాసింజర్ రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కేవలం ఫెస్టివల్ రైళ్లు మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అన్ని ప్యాసింజర్ రైళ్ళ సర్వీసులను పునరుద్ధరిస్తామని రైల్వే శాఖ శుక్రవారం ప్రకటించింది. 
 
ప్రస్తుతం దశల వారీగా రైలు సర్వీసులను పునరుద్ధరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 65 శాతం మేరకు రైళ్ళ రాకపోకలు సాగుతున్నాయి. జనవరి నుంచి  మరో 250 రైళ్ళను అదనంగా నడుపుతున్నాం. మున్ముందు కూడా మరికొన్ని రైళ్లను అదనంగా నడుపుతామని రైల్వేశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా అదుపులోకి వచ్చింది. ఫలితంగా కొత్త కరోనా కేసుల నమోదు కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి అన్ని రకాల ప్యాసింజర్ రైళ్ళతో పాటు శతాబ్ది, రాజధాని రైళ్లను కూడా నడుపుతామని పేర్కొంది. అలాగే రైల్వే టిక్కెట్ల బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ ఐపే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా ప్రయాణికులు టిక్కెట్లను బుక్ చేసుకున్నట్టయితే సమయం ఆదా అవుతుందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments