Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూచ్... నేను అలా అనలేదు.. వ్యవస్థలపై ఎంతో గౌరవం ఉంది.. కొడాలి నాని

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (18:40 IST)
ఏపీ మంత్రి కొడాలి నాని దిగివచ్చారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన షోకాజ్ నోటీసు ఆయనపై బాగానే పనిచేసింది. దీంతో ఆయన మాట మార్చారు. తాను ఎస్ఈసీని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదన్నారు. పైగా, రాజ్యాంగ వ్యవస్థలపై తనకు ఎంతో గౌరవం ఉందని వివరణ ఇచ్చారు.
 
గురువారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సంఘంతో పాటు.. కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కించపరిచేలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను టీవీ ఫుటేజీల్లో చూసిన ఎస్ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసు జారీచేసింది. 
 
మీడియాలో ప్రసారమైన ఫుటేజీని పరిశీలించిన ఎన్నికల కమిషన్.. పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల లోపు వ్యక్తిగతంగా గాని, ప్రతినిధి ద్వారా గాని వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. లేని పక్షంలో తగిన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని పేర్కొంది. 
 
దీంతో మంత్రి కొడాలి నాని దిగివచ్చారు. ఎస్‌ఈసీ షోకాజ్‌ నోటీస్‌కు వివరణ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల విజయంపైనే మాట్లాడానని చెప్పారు. 
 
ప్రతిపక్షాల వేధింపులను ప్రస్తావించానని తెలిపారు. ఎస్‌ఈసీని కించపరిచే ఉద్దేశం, ఆలోచన లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల తనకు గౌరవముందన్నారు. వివరణ పరిశీలించి షోకాజ్‌ నోటీస్ ఉపసంహరించుకోవాలని కొడాలి నాని కోరారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments