Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌ ఇప్పుడు అలెక్సాలో ప్రత్యక్షంగా వినొచ్చు

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (18:16 IST)
అమెజాన్‌ నేడు తమ అలెక్సాపై భారతదేశంలో మొట్టమొదటి సారిగా సెలబ్రిటీ గొంతు అనుభవాలను పొందే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లుగా వెల్లడించింది. భారతీయ సినిమాలో లెజండరీ నటునిగా గుర్తింపు పొందిన శ్రీ అమితాబ్‌ బచ్చన్‌ గొంతును ఇప్పుడు వినియోగదారులు ఎంచుకోవచ్చు. తమ ఎకో ఉపకరణాలపై అలెక్సా అనుభవాలను పొందుతూ అమితాబ్‌ వాయిస్‌ను జోడించుకోవడానికి అమెజాన్‌ షాపింగ్‌ యాప్‌పై మైక్‌ ఐకాన్‌ నొక్కాల్సి ఉంటుంది (ఆండ్రాయిడ్‌లో మాత్రమే). దీని కోసం సంవత్సరానికి 149 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
 
ఈ సెలబ్రిటీ ఎక్స్‌పీరియన్స్‌లో శ్రీ అమితాబ్‌ బచ్చన్‌ ప్రత్యేకంగా ఎంపిక చేసిన కంటెంట్‌ అనుభవాలను పొందవచ్చు. దీనిలో ఆయన జీవితపు కథలు, ఆయన తండ్రి రచించిన పద్యాలలో ఎంపిక చేసిన ఆణిముత్యాలు, స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు మరియు మరెన్నో ఉంటాయి. వీటితో పాటుగా వినోదాత్మక కంటెంట్‌ కూడా ఆస్వాదించవచ్చు. సింపుల్‌గా ‘అమిత్‌జీ, ప్లే సాంగ్స్‌ ఫ్రమ్‌ కభీ కభీ’ లేదంటే ‘అమిత్‌జీ, షోలే కే గానే బజాయే’ లేదా సింపుల్‌గా, ‘అమిత్‌జీ, టెల్‌ మీ ఏ ఫన్నీ స్టోరీ’ అని  అడగడం ద్వారా తెరవెనుక కథలను కూడా  వినొచ్చు.
 
‘‘అలెక్సాపై నా గొంతును పరిచయం చేయడం కోసం అమెజాన్‌తో కలిసి పనిచేయడం వినూత్న అనుభవాలను అందించింది.ఈ నూతన మాధ్యమం ద్వారా నా శ్రేయోభిలాషులు నాతో మాట్లాడవచ్చు’’ అని అమితాబ్‌ బచ్చన్‌ అన్నారు.
 
‘‘అమెజాన్‌ మరియు అలెక్సా వద్ద మేము స్ధిరంగా మా వినియోగదారుల కోసం ఆవిష్కరణలను చేయడంతో పాటుగా అమితాబ్‌ బచ్చన్‌ గొంతు అనుభవాలను అందిస్తున్నాం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ద్వి భాషా సెలబ్రిటీ గొంతు అనుభవాలను సృష్టించడం కోసం స్పీచ్‌ సైన్స్‌ను మేము దాదాపుగా పునరావిష్కరించాల్సి వచ్చింది’’ అని పునీష్‌ కుమార్‌, కంట్రీ లీడర్‌ ఫర్‌ అలెక్సా, అమెజాన్‌ ఇండియా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments