Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మరింతగా శాంతించిన కరోనా : వెయ్యి దాటిన పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (18:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో కరోనా కేసులు మరింత తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,002 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 265 కేసులు, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 7 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,508 మంది కరోనా నుంచి కోలుకోగా... 12 మంది మృతి చెందారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో 14,159 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 20,03,342 కేసులు నమోదు కాగా... 19,75,448 మంది కోలుకున్నారు. మొత్తం 13,735 మంది మృతి చెందారు. నేటి వరకు రాష్ట్రంలో 2,61,39,934 శాంపిల్స్ ను పరీక్షించారు. 
 
ఏపీలో పాఠశాలలు మళ్లీ ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రతి రోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు పాఠశాలల్లో కూడా కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో డీఆర్ఎం మున్సిపల్ స్కూలులో ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు చిన్నారులు కరోనా బారినపడ్డారు. 
 
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎంపీసీ కండ్రిగలోని స్కూలులో ఐదుగురు విద్యార్థులకు కరోనా సోకింది. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు హైస్కూల్లో 10 మందికి కరోనా సోకింది. దీంతో ఈ పాఠశాలకు విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు. పాఠశాలల్లో కరోనా కేసులు వస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ బాలీవుడ్ స్టార్ హీరోల ఆస్తులు విలువ ఎంత?

హైదరాబాద్‌కు చేరిన జైత్వానీ కాదంబరి.. పోలీసుల సెక్యూరిటీతో విజయవాడకు..

కోర్టు రూమ్ డ్రామాతో తక్కువ సినిమాలు వచ్చాయి, ఉద్వేగం బెస్ట్ చిత్రం అవుతుంది : రామ్ గోపాల్ వర్మ

తెలుగు భాష, సంస్కృతికి వెలుగు తేవాలనే ఎన్.టి. ఆర్.తో చిత్రం చేస్తున్నా : వైవిఎస్ చౌదరి

ఎన్నా స్పీడ్ తలా! 234 కిమీ వేగంతో హీరో అజిత్ డ్రైవింగ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్టేజ్ III నాలుక క్యాన్సర్‌తో బాధపడుతున్న 91 ఏళ్ల వృద్ధుడిని కాపాడిన విజయవాడ ఏఓఐ

నేతితో వంకాయ వేపుడు ఎలా?

టీలో కల్తీని గుర్తించటం ఎలా?: ప్రతి వినియోగదారుడు తెలుసుకోవలసిన అంశాలు

లెమన్ గ్రాస్ టీ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ప్రభుత్వం తరపున తెలుగు భాషా ఉత్సవాలను నిర్వహించాలి.. డాక్టర్ నూనె అంకమ్మ రావు

తర్వాతి కథనం
Show comments