Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వచ్ఛంద విరమణకు క్యూ కడుతున్నారు... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (09:38 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్). ఈ సంస్థతో పాటు ఎంటీఎన్ఎల్ సంస్థలను విలీనం చేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. అదేసమయంలో ఈ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాన్ని ప్రవేశపెట్టింది. 50 యేళ్లు పైబడిన ఉద్యోగులు వీఆర్ఎస్‌కు అర్హులుగా ప్రకటించింది. దీంతో వేలాది మంది ఉద్యోగులు స్వచ్ఛంద విరమణ పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
ఈ ఆఫర్ ప్రారంభమైన రెండు రోజుల్లేనే ఒక్క బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నుంచే 22 వేల దరఖాస్తులు వచ్చాయని సంస్థ అధికారులు తెలిపారు. ఈ నెల 5న ప్రారంభమైన వీఆర్‌ఎస్ పథకం డిసెంబర్ 3వ తేదీన ముగియనుంది. తొలి రెండు రోజుల్లో వచ్చిన దరాఖాస్తుల్లో 13 వేల దరఖాస్తులు గ్రూప్ సి తరగతికి చెందిన ఉద్యోగులవేనని అధికారులు పేర్కొన్నారు. 
 
బీఎస్‌ఎన్‌ఎల్‌లో మొత్తం లక్షా యాభైవేల మంది ఉద్యోగులున్నారన్నారు. వీరిలో యాభై ఏళ్ల వయసు మీరిన లక్షమంది వీఆర్‌ఎస్‌కు అర్హులుగా ఉండగా, వారిలో 70 నుంచి 80 వేల మంది వీఆర్‌ఎస్ తీసుకుంటారని బీఎస్‌ఎన్‌ఎల్ భావిస్తున్నట్లు తెలిపారు. ఇదే జరిగితే సంస్థకు నెలకు ఏడువేల కోట్ల రూపాయల మేర వ్యయం తగ్గుతుందని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments