Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలకు హెల్మెట్ లేకుంటే పెట్రోల్ కట్ : యూపీ సీఎం యోగీ మార్క్ రూలింగ్

దేశంలో సంభవిస్తున్న రోడ్డు ప్రమాద మృతుల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులో ఉన్నారు. వీరిలో ఎక్కువగా హెల్మెట్ ధరించకుండా తలకు గాయాలై ప్రాణాలు కోల్పోయిన వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో హెల్మెట్‌లు ధరించి వ

Webdunia
ఆదివారం, 21 మే 2017 (20:30 IST)
దేశంలో సంభవిస్తున్న రోడ్డు ప్రమాద మృతుల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులో ఉన్నారు. వీరిలో ఎక్కువగా హెల్మెట్ ధరించకుండా తలకు గాయాలై ప్రాణాలు కోల్పోయిన వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో హెల్మెట్‌లు ధరించి వాహనం నడపాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయినా వినిపించుకునే నాథుడే లేడు. 
 
ఈ నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్... సరికొత్త నిబంధన విధించారు. హెల్మెట్ లేకపోతే పెట్రోల్ విక్రయించరాదని స్పష్టం చేశారు. ఈ నిబంధన యూపీలో సోమవారం నుంచి అమలుకానుంది. వాస్తవానికి తెలంగాణ సహా అనేక చోట్ల ఈ నిబంధన అమలు కోసం యత్నాలు జరిగాయి. అయితే పెట్రోల్ బంకుల నుంచి వ్యతిరేకత రావడంతో దీన్ని కొంతకాలం పాటు వాయిదా వేశారు. తమ అమ్మకాలు పడిపోతున్నాయని పెట్రోల్ బంకుల యజమానులు మొరపెట్టుకోవడంతో ఈ నిబంధనను అంత సీరియస్‌గా అమలు చేయడం లేదు.
 
అయితే కొత్తగా వచ్చిన యోగి రాజ్యంలో ఈ నిబంధన కాస్త కఠినంగానే అమలు చేయనున్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. దీంతో సోమవారం నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments