Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేత నారాయణ రెడ్డిని కేఈ కుటుంబీకులే హతమార్చారు : వైకాపా

కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి నారాయణరెడ్డిని హత మార్చింది డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబీకులేనని నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసుపై పోలీసులు సమగ్ర విచార

Webdunia
ఆదివారం, 21 మే 2017 (18:03 IST)
కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి నారాయణరెడ్డిని హత మార్చింది డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబీకులేనని నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసుపై పోలీసులు సమగ్ర విచారణ నిర్వహించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
కాగా, ఈ హత్యను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని వైఎస్సార్సీపీ ఓ ప్రకటనలో పేర్కొంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈలే పథకం ప్రకారం ఈ హత్య చేయించారని, ప్రజల  మనసులను గెలుచుకోవడం టీడీపీకి చేతగావడం లేదని, గత మూడేళ్ల టీడీపీ అరాచకపాలనకు ఇది పరాకాష్ట అని మండిపడింది. 
 
హత్యా రాజకీయాలకు టీడీపీ తెరలేపిందని, భయానక వాతావరణం సృష్టించి, హత్యలు చేయించి ప్రతిపక్షం నోరు మూయించేందుకు టీడీపీ సర్కార్ బరితెగించిందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. నారాయణరెడ్డి హత్యతో ఏపీ రాక్షస పాలన ఉగ్రవాద స్థాయికి చేరిందని, ఈ హత్యకు నిరసనగా సోమవారం కర్నూలు జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments