Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మం అందంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

టొమాటో... నిగనిగ లాడే ఎర్రని టొమాటోను చూడగానే తినాలి అనే కోరిక వస్తుంది. ఇది సహజ సిద్ధమైన స్కిన్ టోనర్. మొటిమలు, కురుపులు వంటి వాటిని నయం చేస్తుంది. తాజా టొమాటోలను మిక్సర్ వేసి గుజ్జులా చేయాలి. ఈ టొమాటో గుజ్జును ముఖానికి రాసుకుని పది నిమిషాలు తరువాత

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (21:29 IST)
టొమాటో... నిగనిగ లాడే ఎర్రని టొమాటోను చూడగానే తినాలి అనే కోరిక వస్తుంది. ఇది సహజ సిద్ధమైన స్కిన్ టోనర్. మొటిమలు, కురుపులు వంటి వాటిని నయం చేస్తుంది. తాజా టొమాటోలను మిక్సర్ వేసి గుజ్జులా చేయాలి. ఈ టొమాటో గుజ్జును ముఖానికి రాసుకుని పది నిమిషాలు తరువాత నీళ్ళతో కడిగి వేయాలి. రోజూ అలా చేస్తే చర్మంపై కనిపించే రంధ్రాలు మూసుకుపోతాయి. 
 
అంతేకాదు మొటిమలు మీద గుజ్జును వుంచి గంట తరువాత కడిగి వేయాలి. ఇలా చేయడం వలన ముఖంపై మచ్చలు, మొటిమలు మాయమై కాంతివంతమైన చర్మం వస్తుంది.
 
పుదీనాతో... పుదీనా ఆకును కూరలలో వేసుకుంటాము, బిర్యానిలో, పుదీనా రైస్ కూడా చేసుకుంటాము. ఈ ఆకు ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు అందాన్ని కూడా పెంచుతుంది. దీనిలో వుండే మెంథాల్ చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. మన ముఖంపై వుండే మొటిమలను మచ్చలను తొలగించాలంటే పుదీన రసాన్ని ప్రతిరోజు రాత్రి సమయంలోముఖానికి రాసుకోవాలి. అంతేకాదు పుదీనా ఆకుల్లో రెండు టేబుల్ స్పూన్‌లు పెరుగు వేసి గుజ్జులా చేయాలి. 
 
ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, భాగాలకు రాసుకుని పావు గంట తరువాత కడిగేయాలి. వారంలో కొన్నిసార్లు ఇలా చేస్తే మృదుమైన చర్మం మీ సొంతం అవుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

సరిహద్దులకు చైనా శతఘ్నలను తరలిస్తున్న పాకిస్థాన్ - అప్రమత్తమైన భారత్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

తర్వాతి కథనం
Show comments