Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌందర్యం కోసం వంటింట్లోనే బోలెడు చిట్కాలు...

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (12:07 IST)
ముఖ సౌందర్యం కోసం వంటింట్లోనే బోలెడు చిట్కాలా? అని ఆశ్చర్యపోతున్నారా..? నిజమేనండి. సహజంగా ఉండే మన ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి బ్యూటీపార్లర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మన వంటింట్లో ఉండే దినుసులే మన అందాన్ని మెరుగులు దిద్దడానికి తోడ్పడతాయి. 
 
చర్మంపై ఎక్కువగా కనిపించే సమస్య మృతకణాలు. ఇవి పేరుకుంటే చూడడానికి ముఖం కాస్త జిడ్డుగా, మురికిపట్టినట్టుగా ఉంటుంది. ఇలాంటప్పుడు ముఖానికి చక్కటి ఫేషియల్‌ చేయించుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. కానీ ఇలాంటి ఫేషియల్‌ను వేసుకోవడానికి బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ప్రయత్నించండి. 
 
వంటసోడాలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై సున్నితంగా రుద్దిచూడండి. కొద్దిసేపటికి చర్మంపై మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా కనిపిస్తుంది. అలాగే అప్పుడప్పుడు ఆలివ్‌ ఆయిల్‌ను ముఖంపై రుద్దిచూడండి. దీనివల్ల కూడా మృతకణాలు తొలగిపోయి చర్మం మెరుస్తూ ఉంటుంది. 
 
అలాగే ఆలివ్‌ ఆయిల్‌లో కొద్దిగా కాఫీ గింజల పొడి వేసి దాన్ని ముఖంపై రుద్దినా కూడా మృతకణాలు తొలగిపోతాయి. అలాగే బొప్పాయి, అరటిపండు గుజ్జు రుద్దినా, లేదా కొద్దిగా తేనె, పెరుగు కలిపి రుద్దినా ముఖంపైని మృతకణాలు తొలగిపోయిన చర్మం కొత్త నిగారింపును సంతరించుకుంటుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments