Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 1 May 2025
webdunia

కాఫీ పొడితో సౌందర్యం.. ఎలా?

Advertiesment
coffee powder
, సోమవారం, 14 అక్టోబరు 2019 (15:31 IST)
కాఫీ పొడిని వాడేసి పారేయకండి. ముఖానికి పూతలా వేసుకుని కాసేపయ్యాక కడిగేయండి. ఇది మృతచర్మాన్ని తొలగిస్తుంది. చర్మ గ్రంథుల్ని బిగుతుగా మారుస్తుంది. చర్మాన్ని మృదువుగానూ చేస్తుంది. ఒకవేళ మీది పొడిబారిన చర్మం అయితే ఆ కాఫీ పొడిలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి రాసుకున్నా మంచిదే. 
 
అరటి పండు తొక్కను ముఖానికి రుద్దుకుని 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ చిన్న ప్రయత్నం చర్మానికి తాజాదనాన్ని అందిస్తుంది. మృదువుగా ఉంచుతుంది. ఒక్క అరటిపండే కాదు.. బంగాళాదుంపలూ, కమలాఫలం, నిమ్మ తొక్కలు లాంటివీ వాడుకోవచ్చు. 
 
వీటివల్ల చర్మం ఇంకా బిగుతుగా మారుతుంది. చర్మంలో రక్తప్రసరణ బాగా జరగాలన్నా తాజాగా కనిపించాలన్నా వారానికోసారి నీటిని మరిగించి పది నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. దానివల్ల వ్యర్థాలు దూరమవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కళ్ళలో వాపు, నొప్పి, మంటకు ధనియాల పొడితో మటుమాయం...