Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో అందాన్ని కాపాడుకునేందుకు చిట్కాలు...

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (22:15 IST)
వేసవిలో ఎండల్లో తిరగడం వల్ల చర్మం పొడిబారినట్టుగా అవుతుంది. దీనికి అనేక రకములైన లోషన్స్ వాడుతుంటాము. అలాకాకుండా ఎంతో సులభంగా, తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉన్న పదార్దాలతోనే చిట్కాలు పాటించి అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ టిప్స్ అనుసరిస్తే మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది. అవేంటో చూద్దాం.
 
1. బొప్పాయి రసాన్ని క్రమం తప్పకుండా ముఖానికి రాసుకుంటుంటే సూర్యకాంతి వల్ల చర్మంపై ఏర్పడే గోధుమ రంగు మచ్చలు తగ్గిపోతాయి. చర్మం మెరిసిపోవాలంటే బొప్పాయి గుజ్జులో కొంచెం నిమ్మరసం కలిపి వాడాలి.
 
2. ఒక టేబుల్ స్పూన్ చొప్పున ఓట్ మీల్, పాలు తీసుకుని కలపాలి. ఈ మిశఅరమాన్ని శుభ్రం చేసుకున్న ముఖానికి రాసుకోవాలి. దానిని మీ చేతివేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖఁపై ఉండే మృతకణాలు, అధికంగా ఉండే నూనెలు, దుమ్ముధూళి పోయి చర్మం శుభ్రపడుతుంది. పదిహేను నిమిషాలు ఆగి చల్లని నీటితో కడిగివేయాలి.
 
3. మృదువైన చర్మం కోసం అరచెక్క నిమ్మరసాన్ని ఒక గుడ్డు తెల్లసొనలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పది నిముషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి.
 
4. ఇంట్లో చేసిన ఫేస్ ప్యాక్‌లే వాడాలి. అంటే పెరుగు, గంధం, టొమాటో జ్యూస్, కలబంద గుజ్జు కలిపిన ప్యాక్ ముఖానికి వేయాలి. ఈ మిశ్రమం ముఖచర్మాన్ని శుభ్రం చేయడమే కాకుండా మెరుపును కూడా ఇస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్టిక్ ఐస్ క్రీంలో చనిపోయిన పాము.. ఎంత పెద్ద కళ్ళు..?: ఫోటో వైరల్

తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)

వలపు వల పేరుతో 36 మందిని బురిడీ కొట్టించిన కిలేడీ!

జడ్జి వద్ద విలపించిన పోసాని... తప్పుడు కేసులతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు...

కాంగ్రెస్ పార్టీలో వుంటూ బీజేపీకి పనిచేస్తారా? తాట తీస్తాం.. వారు ఆసియా సింహాలు: రాహుల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

తర్వాతి కథనం
Show comments