Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటిలో క్యాబేజీ ముక్కలు వేసి..?

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (15:50 IST)
మండే ఎండల్లో చర్మ సంరక్షణకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఎండలో చర్మం కమిలినట్లయితే ముఖ్యంగా పొడిచర్మం కలిగినవారు పంచదార, నిమ్మరసం, గ్లిజరిన్ కలిపి మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మసాజ్ చేసుకోవాలి. ఇలా తరచు చేస్తుంటే చర్మ తాజాగా తయారవుతుంది. 
 
స్పూన్ బంగాళాదుంప రసం, స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు అప్లై చేసుకుని పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. రోజూ ఇలా చేస్తూనే ఉండాలి. అప్పుడే.. వేసవికాలంలో వచ్చే చర్మ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
కీరా రసంలో స్పూన్ చల్లని పాలు కలిపి ముఖచర్మానికి రాసి పావుగంట ఆగిన తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు రాయాలి. మూడు టేబుల్ స్పూన్ల పాలు, స్పూన్ పసుపు కలిపి ముఖానికి పట్టించి, కొద్దిసేపాగి కడుక్కుంటే ఫలితం ఉంటుంది. 
 
కొద్దిగా అలోవేరా ఆకులు తీసుకుని నలిపి, నిమ్మరసం కలిపి పేస్ట్ మాదిరి చేసి ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారి మెరిసిపోతుంది. ఆలివ్ ఆయిల్ మసాజ్ వలన కూడా ఫలితం కనిపిస్తుంది. రెండు స్పూన్ల తేనె, నిమ్మరసం కలిపి కమిలిన చర్మంపై రాయాలి. దాంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
 
నీటిలో క్యాబేజీ ముక్కలు వేసి కాచి, నీటిని వడగట్టి, ముక్కల్ని గుజ్జులా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఆగిన తర్వాత కడిగి వేయాలి. ఇలా వారం రోజులు చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అవమానభారం భరించలేక ఇద్దరు పిల్లలను చంపేసి తాను కూడా...

బాలీవుడ్ నటుడు సైఫ్‌కు వారసత్వ ఆస్తులు దక్కేనా?

భిక్షం వేసి బుక్కయ్యారు... పోలీసుల కేసు నమోదు

తెనాలి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.2వేల కరెన్సీ నోట్లు

విజనరీ నేత చంద్రబాబును కలవడం సంతోషంగా ఉంది : బిల్ గేట్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-3లో జాన్వీ కపూర్ ఐటెమ్ సాంగ్ చేస్తే అదిరిపోద్ది.. డీఎస్పీ

సినీ నిర్మాతల గృహాల్లో ముగిసిన ఐటీ సోదాలు...

దిల్ రాజు ఆస్తులపై ఐటి దాడులు- వెంకటేష్ తో సినిమా ప్రచారం.. ఆంతర్యం?

Sai Pallavi :హైలెస్సో హైలెస్సా అంటూ ప్రేమలో జీవించిన నాగ చైతన్య, సాయి పల్లవి

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

తర్వాతి కథనం
Show comments