చర్మ సంరక్షణకు పాటించాల్సిన చిట్కాలివే..?

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (16:12 IST)
వాహనాల సంఖ్య నానాటికి పెరిగిపోవడంతో కాలుష్యం అధికమైపోతుంది. వాహనాల మీద ప్రయాణించే మహిళలు కాలుష్యం కారణంగా ముఖఛాయను కోల్పోవడం వంటి సమస్యలు ఎదుర్కుంటారు. అందుకోసం ఎవరు సలహా ఇచ్చినా తక్షణమే పాటిస్తారు. తెలిసీ తెలియని వారి సలహాలను పాటించడం వల్ల వేరొక సమస్య తలెత్తవచ్చునని బ్యూటిషన్లు పేర్కొంటున్నారు.
 
ఇలాంటి వారికోసం కొన్ని చిట్కాలు... ఏసీ రూముల్లో ఉండే వారికి తొందరగా చర్మం ముడతలు పడుతుంది. ఏసీ రూముల్లో ఉండేవారు మిగిలిన వారి కంటే అధికంగా పాలు, పెరుగు, పండ్లు, మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలి. సాధారణ ప్రాంతాల్లో గలవారు సమతుల్య ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా మాంసకృత్తులు, పోషక పదార్థాలు అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
 
రోజూ కనీసం ఆరు గంటలు కంటి నిండా నిద్రపోవాలి. ఉప్పు, కారం, చింతపండు మరీ ఎక్కువగా వాడకూడదు. కోపం, ఉద్రేకం, విసుగు, ఒత్తిడి వంటివి దరిచేరనీయకూడదు. సంతోషం మినహాయించి ప్రతికూల భావోద్వేగాలు చర్మంపై దుష్ర్పభావం చూపుతాయని వారు చెబుతున్నారు. వారానికోసారి నాణ్యమైన స్కిన్ నరిషింగ్ ఉపయోగించాలి. ఫేషియల్, బ్లీచ్ రసాయనాలతో చేసిన కాస్మెటిక్స్ ఎక్కువగా వాడకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమ్మాయితో డేటింగ్‌కు వెళితే.. కిడ్నాప్ చేసి రూ.7 లక్షలు దోచుకున్నారు..

రేవంత్ ముందు మీ ఆటలు సాగవు... బీఆర్ఎస్ సభ్యులకు సీఎం వార్నింగ్ - సభ్యుల సస్పెన్షన్

పల్నాడులో మూడేళ్ల కుమార్తెతో కలిసి వైద్యుడి కుటుంబం ఆత్మహత్య

తెలంగాణాలో మాంసం ప్రియులకు షాక్... చికెన్ దుకాణాలు బంద్...

కారు డ్రైవర్ కుమారుడికి టిక్కెట్ ఇచ్చిన హీరో విజయ్ (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది ప్రత్యేక ప్రదర్శనలకు కౌంట్‌డౌన్ - మరోవైపు వాయిదాపై అనుమానాలు ?

SITSA: దక్షిణ భారత టీవీ పరిశ్రమకు కొత్త ఊపిరి సిట్సా అవార్డ్స్

'బాహుబలి' రికార్డును బద్ధలు కొట్టిన 'ధురంధర్ : ది రివెంజ్'

Akhil: పెద్ది కోసం అఖిల్ చిత్రం లెనిన్ వాయిదా పడింది

Ramcharan: పెద్ది పహిల్వాన్ గ్లింప్స్ తో ఇండియా నెం.1 ట్రెండింగ్‌లో రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments