పుల్లటి పెరుగుతో చుండ్రు మటాష్!

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (11:56 IST)
చాలా మందిని చుండ్రు సమస్య వేధిస్తూ ఉంటుంది. దీంతో నలుగురిలో నిలబడాలంటే వారు చిన్నతనంగా భావిస్తుంటారు. ఇలాంటి ఇంటి వద్దనే చిన్నపాటి చిట్కాలతో సమస్య నుంచి గట్టెక్కవచ్చు. వెనిగర్‌ని, నీటిని సమపాళ్ళలో తీసుకు‌ని మీ జుట్టుకి పట్టించి తల స్నానం చేస్తే చుండ్రు నుంచి విముక్తి లభిస్తుంది.
 
అలాగే, పుల్లటి పెరుగుని తలకు పట్టించి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు నుంచి మంచి ఫలితం లభిస్తుంది, అంతేకాక జుట్టు మెరుస్తుంది. 2 స్పూన్లు మెంతులు తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు వాటిని పిండిగా చేసి మీ తలకు పట్టించుకుని 15-20 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఆ నానబెట్టిన నీటిని పారవేయకుండా, స్నానం తర్వాత మీ జుట్టుని ఈ నీటితో శుభ్రం చేస్తే చుండ్రు సమస్య చాలా మేరకు తగ్గుతుంది. అంతేగాక జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
 
ఆలివ్ ఆయిల్ మీ జుట్టులోని పొడితనాన్ని, చుండ్రునీ తొలగించుటలో ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని మీ జుట్టుకి పట్టించి మసాజ్ చేయాలి, తర్వాత మీ జుట్టుని ఒక టవల్‌తో చుట్టుకోవాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇలాక్రమం తప్పకుండా చేయడం ద్వారా చుండ్రు సమస్య నుండి శాశ్వతంగా తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధాని అమరావతి, రాష్ట్రపతి ఆమోద ముద్ర

జంట హత్యల కేసులో తొమ్మిది పోలీసులకు మరణశిక్ష: మదురై కోర్టు సంచలన తీర్పు

వివాహేతర సంబంధం - గొంతులో పొడిచి భార్యను హత్య చేసిన భర్త

భార్యతో మాజీ ఎమ్మెల్యే అఫైర్- సొంత యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన భర్త

కీలక దశకు చేరుకున్న ఆర్టెమిస్-2 యాత్ర - 10న భూమికి తిరిగిరాక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊరి మట్టినే ఆయుధంగా మలచి పోరాడిన వ్యక్తి కథగా పళ్లిచట్టంబి

సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పనున్న హీరోయిన్ త్రిష?

Naga Shaurya: బ్యాడ్ బాయ్ కార్తీక్ తో నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను : నాగశౌర్య

చెన్నైలో బుల్లితెర నటి ఆత్మహత్య - భర్తతో వీడియో కాల్‌ చేసిన తర్వాత...

Adivi Sesh: మోకాలి గాయం కారణంగా మూడు నెలలు డెకాయిట్ డిలే అయింది : అడివి శేష్

తర్వాతి కథనం
Show comments